Nattu Nattu Dance by Akhil: దుబాయ్ లో జరుగుతున్న ఒక ప్రైవేట్ పార్టీలో సినీ తారలంతా సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి. సాధారణంగా తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు హీరోలు.. తమ సినిమా షూటింగ్లో నుండి కాస్త సమయం దొరికితే చాలు ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి సిద్ధం అయిపోతారు.
ఈ క్రమంలోనే దుబాయ్ వేదికగా జరుగుతున్న సన్నిహితుల పెళ్లి వేడుకలో హీరోలు, వారి కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. ఇందులో భాగంగానే అక్కడ దిగిన ఫోటోలను నమృత ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకుంది.
కీర్తి, నితేష్ తమ అందమైన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. జీవితాంతం వాళ్లు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ పేర్కొన్నారు. నమ్రత షేర్ చేసిన ఈ ఫోటోలలో ఎన్టీఆర్ ఆయన సతీమణి లక్ష్మీ ప్రణతి, మెగా కోడలు ఉపాసన కొణిదెల, అక్కినేని కోడలు అమల తదితరులు హాజరయ్యారు. ఈ వేడుకలలో అనిరుధ్ తన పర్ఫామెన్స్ తో అందరినీ ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సినీ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి.
అటు స్టార్ హీరోల కుటుంబ సభ్యులను ఒకే ఫ్రేమ్లో చూస్తుంటే సంతోషంగా ఉందని కూడా అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మరొకవైపు నటుడు అఖిల్ కూడా ఈ వేడుకలలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. అక్కడ తన సన్నిహితులతో కలిసి నాటు నాటు పాటకు అదిరిపోయే స్టెప్పులు వేశారు. ఈ వీడియో కూడా నెట్టింట వైరల్ గా మారింది.
Young sensation @AkhilAkkineni8 dance for #NatuNatu in a special event 👌🔥#Akhil6 #AkhilAkkineni pic.twitter.com/PiDPZlmoop
— 𝐀𝐤𝐡𝐢𝐥𝐅𝐫𝐞𝐚𝐤𝐬_𝐅𝐂 (@AkhilFreaks_FC) February 23, 2025
ఇదిలా ఉండగా నమ్రత షేర్ చేసిన ఫోటోలలో నమృత, మహేష్ బాబు కూతురు సితార స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది . అప్పుడే ఇంత పెద్దది అయిపోయిందా అంటూ అభిమానులు కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. తన అంద చందాలతో ఈవెంట్ కే కొత్తదనాన్ని తీసుకొచ్చిందని చెప్పవచ్చు.
ఇదీ చదవండి: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.
ఇదీ చదవండి: Liquor Rates Hike: మందుబాబుకు భారీ షాక్.. భారీగా పెరిగిన బీర్ల ధరలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.