Actress Kushitha: పబ్ ఓపెన్ ఉంది కాబట్టే చిల్ అవడానికి వెళ్లాం... దయచేసి దుష్ప్రచారం వద్దు..

Actress Kushitha on Drugs Case:: ఫుడ్డింగ్ అండ్ మింక్ పబ్‌లో డ్రగ్స్ వ్యవహారంపై నటి కుషిత స్పందించారు. తాను డ్రగ్స్ తీసుకోలేదని... తాను ఎటువంటి టెస్టుకైనా సిద్ధమేనని అన్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 4, 2022, 04:35 PM IST
  • ఫుడ్డింగ్ అండ్ మింక్ డ్రగ్స్ వ్యవహారంపై నటి కుషిత రియాక్షన్
  • తమకూ ఫ్యామిలీస్ ఉన్నాయని.. దుష్ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి
  • పబ్ ఓపెన్ ఉంది కాబట్టే వెళ్లామన్న కుషిత
Actress Kushitha: పబ్ ఓపెన్ ఉంది కాబట్టే చిల్ అవడానికి వెళ్లాం... దయచేసి దుష్ప్రచారం వద్దు..

Actress Kushitha on Drugs Case: హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ హోటల్లో ఉన్న ఫుడ్డింగ్ అండ్ మింక్ పబ్‌పై పోలీసుల దాడుల్లో డ్రగ్స్ కోణం బయటపడిన సంగతి తెలిసిందే. లేట్ నైట్ జరిగిన రేవ్ పార్టీలో పలువురు బడా ఫ్యామిలీల పిల్లలంతా ఒక్కచోట చేరి డ్రగ్స్ మత్తులో ఎంజాయ్ చేశారనే ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంలో ఇప్పటికే రాహుల్ సిప్లిగంజ్, నిహారిక కొణిదెల, పలువురు రాజకీయ నేతల కుమారుల పేర్లు బయటకొచ్చాయి. తాజాగా నటి కుషిత పేరు కూడా బయటపడటంతో ఈ వ్యవహారంపై ఆమె స్పందించారు.

'నా పేరు కుషిత. పార్టీకి వెళ్లింది నిజమే. ఆ సమయంలో పోలీసులు వచ్చారు. అది వాళ్ల డ్యూటీ. వచ్చిచెక్ చేశారు. అయితే అక్కడ ఏం చేయకపోయినా నా పేరు, ఫోటోలు బయటపెడుతున్నారు. దయచేసి అర్థం చేసుకోండి.. నిజమేంటో తెలుసుకోండి. నిజమేంటో తెలుసుకోకుండా దొరికిపోయింది... బయటపడింది అంటూ ప్రచారం చేయొద్దు. మాకు ఫ్యామిలీస్ ఉన్నాయి అర్థం చేసుకోండి. మా పేరు పాడుచేయడానికి ఇలాంటి ప్రచారం చేయొద్దు. పబ్ ఓపెన్ ఉంది కాబట్టి వెళ్లాం. అంతవరకే.  పోలీసులు బ్లడ్ శాంపిల్స్ తీసుకుని ఎవరు డ్రగ్స్ తీసుకున్నారో లేదో టెస్టులు చేయాలి.' అని కుషిత పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.

ఇక ఇదే అంశంపై ప్రముఖ టీవీ చానెల్‌తో మాట్లాడిన కుషిత... ఏ టైమ్‌కి పబ్‌కి వెళ్లానో ఎగ్జాట్‌గా చెప్పలేనని అన్నారు. తాను వెళ్లి కూర్చొన్న 15 నిమిషాలకే మ్యూజిక్ ఆఫ్ అయిందని... లైట్స్ ఆన్ చేశారని తెలిపారు. పబ్ బంద్ చేశారేమో ఇక ఇంటికి వెళ్దామనుకుంటున్న సమయంలో... పబ్‌పై పోలీసులు రైడ్ చేస్తున్నట్లు తెలిసిందన్నారు. డ్రగ్స్‌ వాడుతున్నారనే సమాచారంతో పోలీసులు రైడ్‌కి వచ్చినట్లు తెలిసిందని... అక్కడి నుంచి ఎవరిని బయటకు వెళ్లేందుకు అనుమతించలేదని చెప్పారు. తానేమీ డ్రగ్స్ తీసుకోలేదని... ఇంటికి వెళ్లేందుకు అనుమతించాలని పోలీసులతో ఎంత అరిచినా వినిపించుకోలేదన్నారు. స్టేషన్‌కు రావాల్సిందేనని చెప్పడంతో వెళ్లాల్సి వచ్చిందన్నారు. నిజానికి ఆ సమయంలో పబ్ ఓపెన్ ఉంది కాబట్టి చిల్ అవడానికి వెళ్లామన్నారు. 

కాగా, కుషిత షార్ట్ ఫిలిమ్స్ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. తాజా డ్రగ్స్ కేసులో ఆమె పేరు బయటకు రావడంతో కుషితపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో వీడియో సందేశాన్ని విడుదల చేసిన కుషిత... డ్రగ్స్‌ వ్యవహారంతో తనకెటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. 

Also Read: RRR Collections: 'ఆర్ఆర్ఆర్' ఖాతాలో మరో రికార్డు... 10 రోజుల్లోనే కలెక్షన్లు ఏ స్థాయిలో ఉన్నాయంటే...

Also Read: KTR vs DK: వాళ్లను బ్యాగ్ సర్దేయండన్న కేటీఆర్.. మధ్యలో కర్ణాటక పీసీసీ చీఫ్ జోక్యం...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News