Actor Sivaji: మీసాలు తీసేసి.. వేషం మార్చి దుబాయ్‌లో దొరికిపోయిన శివాజీ.. అలీ అడిగిన ప్రశ్నతో..!

Sivaji Alitho Saradaga Show Promo: ఆలీతో సరదగా షోలో నటుడు శివాజీ పాల్గొన్నారు. ఆలీతో ఫన్నీగా ముచ్చటిస్తూ.. తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను పంచుకున్నారు. రైతుగా తన తండ్రి పడిన శ్రమను వివరించారు. అదేవిధంగా వేషం మార్చి దుబాయ్‌లో దొరికిపోయిన శివాజీ అంటూ జరిగిన ప్రచారంపై కూడా స్పందించారు.   

Written by - Ashok Krindinti | Last Updated : Mar 9, 2024, 09:49 PM IST
Actor Sivaji: మీసాలు తీసేసి.. వేషం మార్చి దుబాయ్‌లో దొరికిపోయిన శివాజీ.. అలీ అడిగిన ప్రశ్నతో..!

Sivaji Alitho Saradaga Show Promo: బిగ్ బాస్ షో, 90's మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్‌తో నటుడు శివాజీ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత క్రేజ్ అమాంతం పెరిగిపోగా.. వెబ్ సిరీస్‌తో నటుడిగా రీఎంట్రీకి రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ వెబ్ సిరీస్‌ హిట్‌తో ఊహించని పబ్లిసిటీ సంపాదించుకున్నారు. అంతకుముందు బిగ్ బాస్ విన్నర్‌గా పల్లవి ప్రశాంత్ నిలవడంతో శివాజీ వెనుక ఉండి నడిపించారంటూ ప్రశంసలు కూడా దక్కాయి. ప్రస్తుతం ఆయన వరుసగా టీవీ షోలు, ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ ఫుల్ బిజీగా ఉన్నారు. నెట్టింట ఎక్కడ చూసినా 90's మిడిల్ క్లాస్ బయోపిక్ మీమ్స్, షార్ట్స్ తెగ వైరల్ అవుతున్నాయి. ఈ వెబ్ సిరీస్‌ను శివాజీ గట్టిగానే ప్రచారం చేస్తున్నారు.

Also Read: Hansika Motwani: గులాబీ రంగు చీరలో కవ్విస్తున్న 'దేశముదురు' పిల్ల..

తాజాగా ఆయన ఆలీతో సరదాగా షోకు విచ్చేశారు. ఇందుకు సంబంధించిన ప్రోమోను నిర్వాహకులు రిలీజ్ చేయగా.. శివాజీ ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నట్లు తెలుస్తోంది. ముందుగా పద్మావతి.. పద్మావతి అంటూ సాగే సాంగ్‌కు ఆలీతో కలిసి శివాజీ చిందులేశారు. యాక్టింగ్‌కు దూరంగా ఉన్న శివాజీకి 90's మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్‌ ఛాన్స్ ఎలా వచ్చిందని ఆలీ అడిగారు. "ఓ రోజు ఎందుకో అనిపించింది. బాపినీడు గారిని కలుద్దామా..? అని.. ఇది వచ్చింది సార్.. ఎలా మరి అని అడిగా. హా అది చేయ్ అని చెప్పారు. అపొద్దన్నారు. ఆ ఒక్క వెబ్ సిరీస్‌కు 5 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు వచ్చారు." అని శివాజీ చెప్పారు.

ఇద్దరు కొడుకులతో పాటు కూతురు కూడా ఉన్నట్లు బయట టాక్ ఏంటి అని ఆలీ సరదగా ప్రశ్నించగా.. ఆ కూతురు ఎక్కడ ఉందో ఇస్తే హ్యాపీ.. పెంచుకుంటాను నేను.. బంగారంలా చూసుకుంటానంటూ శివాజీ నవ్వుతూ చెప్పారు. ఉదయ్ కిరణ్, తారకరత్నలకు తాను డబ్బింగ్ చెప్పానని.. ఉల్లాసంగా.. ఉత్సాహంగా, దిల్ సినిమాలో నితిన్‌కు చెప్పానని తెలిపారు. దిల్ సినిమాకు తనకు నంది అవార్డు వచ్చిందన్నారు. తనకు టెన్త్‌లో 269 మార్కులు వచ్చాయని.. అది కూడా ఒకేసారి రాలేదన్నారు. ఊరి నుంచి రావడానికి కారణం ఏంటి అని అలీ ప్రశ్నించారు.

"జీవితం చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాం. పాపం మా నాన్న మమ్మల్ని చదవించేందుకు, వ్యవసాయం చేసేందుకు చాలా కష్టపడేవారు. వ్యవసాయంలో మీకు తెలియంది ఏముంది. పెద్దగా ఏమి మిగలదు. బతకడానికి.. బతికిన దానికి అప్పులు. అంతకుమించి ఏముండదు రైతుకు. అటువంటి పరిస్థితుల్లో అర్థమైంది లైఫ్. బాధ్యత తీసుకునేందుకు సిద్ధపడి హైదరాబాద్‌కు వచ్చా. నేను మళ్లీ ఊరు వెళ్లాలని నిర్ణయించుకున్నా. నరసరావుపేటకు తొమ్మిదో తరగతి చదవాలంటే నాకు చెప్పులు కొన్నారు. ఆ రోజు ఉన్న పరిస్థితి.. ఈ రోజు ఉన్న పరిస్థితి వేరు.." అని శివాజీ చెప్పారు.

ఎవరు గుర్తుపట్టకూడదని మీసాలు తీసేసి తిరిగావు ఎందుకని అలీ అడగ్గా.. "వేషం మార్చి దుబాయ్‌లో దొరికిపోయిన శివాజీ. అప్పటికప్పుడు వార్తల్లో వేశారు.." అని శివాజీ గుర్తుచేసుకున్నారు. కాగా.. 2019లో అలంద మీడియా విషయంలో శివాజీకి పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారని వార్తలు వచ్చాయి. దీంతో దేశం విడిచి వెళ్లకూడదన్నారు. కానీ శివాజీ మీసాలు తీసేసి అమెరికా వెళుతూ దుబాయ్‌లో పట్టుబడిట్లు ప్రచారం జరిగింది. ఈ విషయాన్ని శివాజీ ఖండించారు. తాను 50 సార్లకుపై అమెరికా వెళ్లానని.. ప్రతిసారి లీగల్‌గానే వెళ్లానని చెప్పారు.  

Also Read: Indiramma Housing Scheme: ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షలు.. ఎప్పుడు.. ఎంతిస్తారంటే..? 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News