1000 Vaala Pre Release Event: సూపర్ హిట్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై షారుఖ్ నిర్మాణంలో కొత్త నటుడు అమిత్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం 1000 వాలా. యువ దర్శకుడు అఫ్జల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ప్రముఖ నటులు సుమన్, పిల్లాప్రసాద్, ముఖ్తార్ ఖాన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.
సినిమా విడుదలకు ముందు చిత్రబృందం అంగరంగ వైభవంగా 1000 వాలా ఫ్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన సీనియర్ హీరో సుమన్ ట్రైలర్‌ను విడుదల చేశారు. యాంకర్ స్వప్న చౌదరి తన మాటలతో వేడుకను మరింత ఆసక్తికరంగా మార్చారు.
ఈ సందర్భంగా హీరో సుమన్ మాట్లాడుతూ, "యువ ప్రతిభను ప్రోత్సహించడం చాలా ఆనందంగా ఉంది. చిత్రబృందం సమిష్టిగా కృషి చేసి మంచి సినిమా తీసుకువచ్చారు. టీమ్‌కి, ముఖ్యంగా హీరో అమిత్, దర్శకుడు అఫ్జల్, నిర్మాత షారుఖ్‌కి నా శుభాకాంక్షలు" అని అన్నారు.
మరో అతిథి మోహన్ గౌడ్ మాట్లాడుతూ, "ఇలాంటి యువకుల సినిమా ఇండస్ట్రీకి ఎంతో అవసరం. 1000 వాలా సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను" అని అభిప్రాయపడ్డారు.
ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ కాండ్రేగుల ఆదినారాయణ మాట్లాడుతూ, "ఈ సినిమా కంటెంట్ చాలా బలంగా ఉంది. మంచి కథలు ఎప్పుడూ ప్రేక్షకుల మనసులు గెలుస్తాయి. 1000 వాలా చిత్రాన్ని 280 థియేటర్లలో విడుదల చేయడానికి నేను తోడుగా ఉంటాను" అని తెలిపారు.
హీరో అమిత్ తన ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ, "హీరో కావాలనే కల 10 ఏళ్లుగా నాలో ఉంది. అనేక కష్టాలు అనుభవించాను, ఎన్నో అడ్డంకులను దాటాను. నా కృషికి అఫ్జల్ గారు, నిర్మాత షారుఖ్ గారు మద్దతుగా నిలిచారు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. ప్రేక్షకుల ఆదరణను ఆశిస్తున్నాను" అని భావోద్వేగంగా మాట్లాడారు.
దర్శకుడు అఫ్జల్, నిర్మాత షారుఖ్ మాట్లాడుతూ, "1000 వాలా టీజర్‌కు సోషల్ మీడియాలో అద్భుతమైన స్పందన లభించింది. ఈ సినిమా మాస్ ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అన్ని అంశాలతో తెరకెక్కింది. ట్రైలర్‌కు వచ్చిన రెస్పాన్స్ కూడా అద్భుతంగా ఉంది. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం" అని చెప్పుకొచ్చారు.
ఇదీ చదవండి: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే..
ఇదీ చదవండి: తాగుడుకు బానిసై సినీ కెరీర్ నాశనం.. 44 ఏళ్ల వయసులో స్టార్ హీరోయిన్ రెండో పెళ్లి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.