Maha Shivarathiri: దేవుడి ఊరేగింపు చూసేందుకు వెళ్లిన బాలిక ఊహించని పరిణామంతో ప్రాణాలు కోల్పోయింది. పండుగ నాడు ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. నిమిషాల వ్యవధిలో జరిగిన ఈ సంఘటనలో బాలిక ప్రాణాలు కోల్పోవడంతో జాతర విషాదం అలుముకుంది. భక్తులందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. ఉత్సవాల సందర్భంగా వెలిగించిన బాణసంచా బాలిక ప్రాణం తీసింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహాశివరాత్రి తరువాతి రోజు చోటుచేసుకుంది.
Also Read: Woman Killed: ఆస్ట్రేలియాలో తెలంగాణ మహిళ దారుణ హత్య.. సంచలనం రేపుతున్న భర్త వ్యవహారం
తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం త్యాజంపూడి గ్రామానికి చెందిన దాసరి పుష్ప 9వ తరగతి చదువుతుండేది. మహా శివరాత్రి సందర్భంగా వీరంపాలెంలో శ్రీ బాలాత్రిపుర సుందరి పీఠంలో అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుగుతున్నాయి. మహా శివరాత్రి తర్వాతి రోజు శనివారం ఉత్సవాలు ముగిశాయి. ఈ ఉత్సవాలు చూసేందుకు పుష్ప స్వగ్రామం నుంచి వీరంపాలెం వచ్చింది. ఊరేగింపు సందర్భంగా నిర్వాహకులు పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు. అయితే ఈ సమయంలో బాణసంచా కాలుస్తుండగా కొన్ని టపాసులు వచ్చి పుష్ప తలపై పడ్డాయి. టపాసుల ధాటికి పుష్ప తీవ్రంగా గాయపడింది. వెంటనే నిర్వాహకులు, స్థానికులు కలిసి ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే బాలిక మృతి చెందిందని వైద్యులు తెలిపారు.
Also Read: Sad Incident: మహా శివరాత్రి రోజు కలచివేసే ఘటన.. చిన్నారి ప్రాణాలు బలిగొన్న 'కుట్టు మిషన్'
బాలిక మృతి విషయం తెలుసుకున్న పోలీసులు పుష్ప మృతదేహానికి తాడేపల్లిగూడెం ప్రభుత్వ వైద్యశాలలో పోస్ట్ మార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. యర్నగూడెంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పుష్ప 9వ తరగతి చదువుతోంది. ఉత్సవాల కోసం వెళ్లిన బాలిక విగతజీవిగా మారడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పండుగ సంబరాలు తమ ఇంట్లో విషాదం నింపడం కలచివేసింది. ఈ ఘటనతో త్యజపూడిలో విషాద వాతావరణం అలుముకుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter