Interstate Gang: వాట్ ఏ ప్లానింగ్.. జులాయి మూవీ సీన్ రిపీట్.. తీగ లాగితే డొంకంతా బయటపడింది..!

Cyberabad Police Arrested Interstate Gang: అంతరాష్ట్ర దొంగల ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. వందకుపైగా కేసుల్లో నిందితులుగా ఐదుగురు దొంగలు పోలీసులకు రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. మహారాష్ర్ట పోలీసులేపైనే దాడి చేసి పారిపోయిన ఈ ముఠాకు పోలీసులు చెక్ పెట్టారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 12, 2023, 08:32 PM IST
Interstate Gang: వాట్ ఏ ప్లానింగ్.. జులాయి మూవీ సీన్ రిపీట్.. తీగ లాగితే డొంకంతా బయటపడింది..!

Cyberabad Police Arrested Interstate Gang: బ్యాంకులు, జ్యువెలరీ షాపులే వారి టార్గెట్.. ఖజానాపై  కన్నేస్తారు. పక్కా ప్లాన్‌తో కాజేస్తారు. అంతకుముందే రెక్కీ నిర్వహిస్తారు. వేసిన స్కేచ్, గీసిన మ్యాప్ ఎక్కడ మిస్ చేయరు. ఎక్కడ దోచుకున్నారో అక్కడే సొత్తు అమ్మేయడం.. గుట్టుచప్పుకాకుండా పరార్ అవ్వడం.. ఇలా ఒకటి కాదు రెండు ఏకంగా వంద చోట్ల చోరీలు చేశారు. మహారాష్ర్ట పోలీసులేపైనే దాడి చేసి పారిపోయిన ఈ ముఠా చివరికి సైబరాబాద్ పోలీసులకు చిక్కారు. ఇంతకీ ఆ ముఠా చేసిన ఆరాచక దోపిడీల వివరాలు ఇలా..

అచ్చం  జులాయి సినిమాలోని  తలపించే సీన్ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. దొంగల ముఠాను ముందుగానే పసిగట్టి నేరాలను అదుపు చేశారు సైబరాబాద్ కమిషనరేట్  పోలీసులు. పుణెకు చెందిన ఐదుగురు అంతరాష్ట్ర దొంగల ముఠాను సైబరాబాద్ పోలీసులు రెడ్ హ్యాండ్‌గా పట్టుకున్నారు. మహరాష్ర్టలోని పుణే ప్రాంతానికి చెందిన అమర్ సింగ్ జాగర్ సింగ్, లక్కీ సింగ్ గబ్బర్ సింగ్, నిహల్ సింగ్ మనవ్ సింగ్, జీతా సింగ్ రాజాపుల్ సింగ్, నిశాంత్ అనే ఐదుగురు నిందితులు హైదరాబాద్‌లోని  బ్యాంకులు, జ్యువెలరీ షాపులోని ఖజానాను దోచుకునేందుకు ప్లాన్ చేశారు. 

పుణె నుంచి వచ్చిన ఈ గ్యాంగ్ దుకాణాలను టార్గెట్‌గా చేసుకుని చోరికి పాల్పడేందుకు  రైల్ మార్గాల్లో సిటీలోకి ఎంటర్ అయ్యారు. హైదరాబాద్‌కు వచ్చి నగరంలోని జీడిమెట్ల ప్రాంతంలో  ఉండేవారు. లాడ్జ్‌లలో షెల్టర్ తీసుకుంటే పోలీసులకు అనుమానం వస్తుందనే ఉద్దేశంతో జీడిమెట్లలోని ఒక నిర్మాణంలో ఉన్న భవనంలో ఉంటున్నారు. బ్యాంకులు, జ్యూవెలరీ షాపుల్లో చోరీకు ముందే ఓ కారును దొంగతనం చేయాలని అనుకున్నారు. సంగారెడ్డిలోని గుమ్మడిదల గ్రామంలో ఒక టాటా ఏస్ వాహనాన్ని చోరీ చేశారు. 

బ్యాంకులు, బంగారం షాపుల్లో చోరీ చేసేందుకు ఓ షాపులో ఐరన్ రాడ్లు, తల్వార్‌లు, టోపీలు, లైట్లు, స్క్రూడ్రైవర్లు, పట్టుకార్లు తదితర సామగ్రిని కొనుగోలు చేశారు. ప్రాణరక్షణ కోసం తుపాకులను కూడా తెచ్చుకున్నారు. నగరంలోని కొన్ని ప్రాంతాలనే టార్గెట్‌గా పెట్టుకున్నారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న షాపులపై కన్నేసి.. స్కెచ్ వేసి దోచుకునేందుకు ప్లానింగ్ చేశారు.  అంతకుముందు  మహారాష్ట్రలో చోరీకి పాల్పడిన బంగారాన్ని సైబరాబాద్‌లో విక్రయించి లక్ష రూపాయలు తీసుకున్నారు. ఇక్కడ వేసిన చిన్న మిస్టెక్‌తో ఐదుగురు నిందితులు కూడా రెడ్ హ్యాండెడ్‌గా పోలీసులకు దొరికిపోయారు. 

Also Read: Surya Kumar Yadav IPL: సూర్యకుమార్ యాదవ్ నువ్వో తోపు ప్లేయర్.. బ్యాట్‌తోనే సమాధానం చెప్పు 

తీగ లాగితే నిందితుల అసలు డొంక బయటపడింది. అంతేకాకుండ ముందుగా షాపూర్ నగర్‌లోని ఓ జ్యూవెలరీ షాపులో రెక్కీ నిర్వహించారు. జ్యూవెలరీ షాపులో చోరీ చేసి తర్వాత కారులో పారిపోవాలని ప్లాన్ వేసుకున్నారు. అయితే 11వ తేదీ రాత్రి షాపూర్ నగర్‌లోని ఆదర్శ బ్యాంక్ దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులకు పట్టుపడ్డారు నిందితులు. ఐదుగురిని పోలీసులు అదుపులో తీసుకొని ప్రశ్నించగా.. అసలు కథ బయటపడింది. ఒకటి కాదు రెండు కాదు.. నిందితుల కేసులు దాదాపు వందకు పైగే ఉన్నాయని పోలీసుల దర్యాప్తులో తేలింది. నిందితులను విచారించిన పోలీసులే షాక్‌కు గురయ్యారు. 

మహరాష్ర్టలో పోలీసులపైనే దాడి చేసినట్లు తెలిసింది. ఇలాంటి దోపిడీ నేరాలకు పాల్పడుతన్న నిందితులపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని సైబరాబాద్ కమిషనరేట్  పోలీసులు తెలిపారు. ఐదుగురు నిందితుల కేసుల వివరాలు చూస్తుంటే.. జులాయి సినిమా తలపించే  సన్నివేశాలు తలపించేలా కనిపిస్తున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఈ నిందితులు.. నగర శివారు ప్రాంతాల్లో షెడ్డుల్లో, లాడ్జీల్లో ఉంటూ తెల్లవారుజామున లేదా రాత్రి సమయాల్లో చోరీలు చేస్తు పోలీసులకు అడ్డంగా దొరికిపోతున్నారు. చివరికి జైలు పాలవుతున్నారు. 

Also Read: Karnataka Elections: రైతు బిడ్డను పెళ్లి చేసుకుంటే రూ.2 లక్షలు.. ఎన్నికల్లో మాజీ సీఎం విచిత్ర హామీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News