Diwali Muhurat Trading: నేడే ముహూరత్ ట్రేడింగ్.. దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటి..? దివాలి మార్కెట్ సెంటిమెంట్ ఇదే

Diwali Muhurat Trading: ముహూరత్ ట్రేడింగ్ సందర్భంగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి చాలా మంది ఇన్వెస్టర్లు సిద్ధంగా ఉన్నారు. నేడు నిర్వహించే గంట సేపు ముహూరత్ ట్రేడింగ్ కోసం ఇన్వెస్టర్లు ఏడాదంతా వేచి చూస్తుంటారు. అసలు దీని ప్రాముఖ్యత ఏంటో ఎందుకు నిర్వహిస్తారో తెలుసుకుందాం.  

Written by - Bhoomi | Last Updated : Nov 1, 2024, 10:27 AM IST
Diwali Muhurat Trading: నేడే ముహూరత్ ట్రేడింగ్.. దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటి..? దివాలి మార్కెట్ సెంటిమెంట్ ఇదే

Diwali Muhurat Trading: దీపావళి ముహూరత్ ట్రేడింగ్ నేడు అంగరంగ వైభవంగా స్టాక్ మార్కెట్లలో జరగనుంది. ప్రతి సంవత్సరం దీపావళి రోజున ఒక గంట సేపు ట్రేడింగ్ నిర్వహిస్తారు. నవంబర్ ఒకటో తేదీ సాయంత్రం 6 గంటల నుంచి ఏడు గంటల వరకు ప్రత్యేకంగా స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ నిర్వహిస్తారు. ఈ గంటసేపు ఇన్వెస్టర్లు షేర్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. దీన్నే ముహూర్త ట్రేడింగ్ అంటారు. 

విక్రమశకం క్యాలెండర్ పద్ధతి పాటించే వారికి దీపావళి అనేది నూతన సంవత్సరం. విక్రమ సంవత్సరం 2081 ఈరోజు నుంచి ప్రారంభం అవుతుంది. విక్రమాదిత్యుడు రాజ్య సింహాసనం ఎక్కిన రోజు నుంచి ఈ శకం ప్రారంభమైంది. ఈ క్యాలెండర్ గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, హర్యానాకు చెందిన వ్యాపారులు పాటిస్తుంటారు. దీపావళిని కొత్త సంవత్సరానికి మొదటి రోజుగా భావిస్తారు. 

అలాగే కొంతమంది వ్యాపారులు కూడా తమ ఖాతా పుస్తకాలను ఈరోజు నుంచి ప్రారంభిస్తారు. ఈ సాంప్రదాయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి సంవత్సరం స్టాక్ మార్కెట్లలో ముహూరత్ ట్రేడింగ్ చేస్తుంటారు. ఈరోజు కొన్ని ప్రత్యేకమైన స్టాక్స్ కొనుగోలు చేస్తారు. ఈ దీపావళి రోజు కొన్న స్టాక్స్ వచ్చే దీపావళి నాటికి చక్కటి లాభాలను ఇస్తాయని వారు నమ్ముతారు. ముహూర్త ట్రేడింగ్ అనే సాంప్రదాయం చాలాకాలంగా వస్తుంది. అయితే గడచిన ఏడాదికాలంగా గమనించినట్లయితే స్టాక్ మార్కెట్లో ఆల్ టైం రికార్డ్ స్థాయిని తాకాయి. 

నిఫ్టీ దాదాపు 25 శాతం పెరిగింది. సంవత్ 2080లో నిఫ్టీ సెన్సెక్స్ సరికొత్త రికార్డులను స్థాపించాయి. స్టాక్ మార్కెట్లలో ఎవరైతే ప్రవేశించాలి అనుకుంటారో వారికి ముహూర్త ట్రేడింగ్ మంచి సమయం అని చెప్పవచ్చు. 

ముహూరత్ ట్రేడింగ్ మొట్టమొదట 1957లో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE)లో ప్రారంభమైంది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE)లో ముహూరత్ ట్రేడింగ్ 1992 సంవత్సరంలో ప్రారంభమైంది. ఎలక్ట్రానిక్ డీమ్యాట్ ఖాతాలు రాకముందు వ్యాపారులు ఎక్స్ఛేంజీలకు వచ్చి ముహూరత్ ట్రేడింగ్‌లో పాల్గొనేవారు.

Also Read: LPG Gas Cylinder: సామాన్యులకు పండుగ పూట బిగ్‌షాక్.. ఏకంగా రూ.2,028 చేరిన గ్యాస్‌ సిలిండర్‌..  

గత 11 సంవత్సరాల ముహూరత్ ట్రేడింగ్ చరిత్రను పరిశీలిస్తే, స్టాక్ మార్కెట్ 11 సెషన్లలో 9 సెషన్లలో సానుకూలంగా ఉంది. 2018 నుండి, మార్కెట్ ముహూరత్ ట్రేడింగ్ రోజులలో స్థిరంగా సానుకూల రాబడిని ఇచ్చింది. ఇది 2016, 2017లో మాత్రమే నెగిటివ్ రాబడిని ఇచ్చింది.023 ముహూరత్ ట్రేడింగ్ సెషన్‌లో, సెన్సెక్స్ 355 పాయింట్లు లాభంతో 65,259 వద్ద ముగియగా, నిఫ్టీ 50 ఇండెక్స్ 100 పాయింట్లు పెరిగి 19,525 వద్ద ముగిసింది. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ స్టాక్‌లు లార్జ్‌క్యాప్ కంటే మెరుగ్గా పనిచేశాయి.

Also Read: Rahu Mahadasha: రాహు మహాదశ ఈ రాశికి 18 ఏళ్లు రాజభోగాలు.. లక్షాధికారి అయ్యే బంపర్‌ ఛాన్స్‌!  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News