Indian Stock Market: స్టాక్ మార్కెట్లో ఉదయం నుంచి కూడా భారీగా పతనం అవుతున్నాయి. సెన్సెక్స్ ప్రస్తుతం 640 పాయింట్లు నష్టపోయి, 80,000 పాయింట్ల దిగువన ట్రేడ్ అవుతోంది. ఇండస్ ఇండ్ బ్యాంక్ అత్యధికంగా 19 శాతం నష్టోపయింది. అలాగే మహీంద్రా అండ్ మహీంద్రా సైతం 5 శాతం నష్టపోగా, అదానీ ఎంటర్ ప్రైజెస్ 4 శాతం చొప్పున నష్టపోయాయి. బ్యాంక్ నిఫ్టీ 1.70 శాతం నష్టపోయింది. బ్యాంకింగ్ స్టాక్స్ లో ప్రధానంగా ఎస్బీఐ 1.49 శాతం నష్టపోగా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 3 శాతం నష్టపోయింది. ఇక బ్యాంక్ ఆఫ్ బరోడా 2.40 శాతం నష్టపోయింది. BSEలో లిస్ట్ అయిన కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ మునుపటి సెషన్‌లో దాదాపు రూ. 444 లక్షల కోట్ల నుండి దాదాపు రూ. 435 లక్షల కోట్లకు పడిపోయింది. పెట్టుబడిదారులను ఒక్క సెషన్‌లో సుమారు రూ. 9 లక్షల కోట్లు నష్టపోయారు.
భారత స్టాక్ మార్కెట్ ఎందుకు పతనమవుతోంది ?
ఎఫ్‌పీఐల వరద :
విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పిఐలు) దూకుడుగా మార్కెట్లో షేర్లను విక్రయించడం మార్కెట్ పతనానికి ప్రధాన కారణంగా నిపుణులు భావిస్తున్నారు. NSDL డేటా ప్రకారం, FPIలు అక్టోబర్‌లో 24వ తేదీ వరకు రూ. 80,954 కోట్ల విలువైన భారతీయ ఈక్విటీలను ఇప్పటి వరకూ విక్రయించాయి. చైనా ఇప్పటివరకు తీసుకున్న మార్కెట్ స్థిరీకరణ నిర్ణయాలతో ఎఫ్ఐలు చైనా మార్కెట్లవైపు తరలుతున్నాయి.
Also Read: Optical Illusion: ఈ ఆకుల్లో కప్ప దాగి ఉంది...15 సెకండ్లలో కనుక్కుంటే మీరే జీనియస్
బలహీన Q2 రిజల్ట్స్:
సెప్టెంబర్ q2 ఆదాయాలు బలహీనంగా ఉన్నాయి, ఇది మార్కెట్లో ఆందోళనను తీవ్రతరం చేసింది. పలు కంపెనీల లాభదాయకత ఎఫెక్ట్ కావడంతో క్యూ2లో రిజల్ట్స్ బలహీనంగా ఉన్నాయి. ఇప్పటివరకు విడుదలైన మార్కెట్ రిజల్ట్స్ లో పలు లార్జ్ క్యాప్ కంపెనీలు పెద్దగా పెర్ఫామెన్స్ చూపించలేదు.
US ఎన్నికలు:
US ఎన్నికల చుట్టూ ఉన్న వార్తలు సైతం మార్కెట్ సెంటిమెంట్‌పై ప్రభావం చూపుతోంది. నవంబర్ 5 ఎన్నికలకు రెండు వారాల లోపే, తాజా ఒపీనియన్ పోల్ ట్రెండ్స్ కమలా హారిస్, డొనాల్డ్ ట్రంప్ మధ్య హోరాహోరీ పోరును చూపుతున్నాయి. హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ దీపక్ జసాని ప్రకారం, కమలా హారిస్ అధ్యక్షురాలైతే, బైడెన్ అడ్మినిస్ట్రేషన్ తీసుకున్న వాణిజ్య విధానాలను ఆమె ముందుకు తీసుకెళ్తుంది. అయితే ట్రంప్ అధికారంలోకి వస్తే మాత్రం భారత్ చైనాలతో వాణిజ్య బంధం పైన పెద్ద ఎత్తున ప్రభావం చూపి అవకాశం ఉంటుంది. దీనికి తోడుగా ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య యుద్ధం కూడా స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపిస్తుంది.
Also Read: Gold Price Today: పండగ ముందు పసిడి ప్రియులకు ఊరట.. శాంతించిన బంగారం ధర.. ఎంత తగ్గిందంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter