Savings Account: ప్రస్తుతం దాదాపు ప్రతి ఒక్కరికి బ్యాంక్ ఉంటుంది. డిజిటల్ పేమెంట్స్ అందుబాటులోకి వచ్చిన తరువాత ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల్లో అకౌంట్లు ఓపెన్ చేశారు. అయితే ఒకటి కంటే ఎక్కువ సేవింగ్ ఖాతాలు ఉంటే ఇబ్బందులు ఎదురుకావచ్చు. అయితే అందరికి కాదు. నెలవారీ జీతం పొందే వ్యక్తులు వివిధ రకాల సేవింగ్ ఖాతాలను కలిగి ఉండటం కంటే.. ఒకే సేవింగ్స్ బ్యాంక్ ఖాతాను మెయింటెన్ చేయడం బెటర్ అని నిపుణులు సూచిస్తున్నారు. ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఫైల్ చేసే సమయంలో మీ బ్యాంకింగ్ వివరాలు చాలా వరకు ఒకే బ్యాంకు ఖాతాలో అందుబాటులో ఉంటే పని సులభం అవుతుందని ట్యాక్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ నిపుణులు అంటున్నారు.
మీకు ఒకే సేవింగ్స్ బ్యాంక్ ఖాతా ఉంటే.. మీరు పొందే కొన్ని ద్రవ్య ప్రయోజనాలు ఉన్నాయి. డెబిట్ కార్డ్ ఏఎమ్‌సీ, ఎస్‌ఎంఎస్ సర్వీస్ ఛార్జీలు, మినిమమ్ బ్యాలెన్స్ మొదలైన వాటిపై విధించే బ్యాంక్ సర్వీస్ ఛార్జీలను మీరు ఆదా చేసుకోవచ్చు. ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు పొదుపు ఖాతాలను కలిగి ఉండటం అంటే.. అత్యధికంగా మోసం జరిగే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు.. ఒక సంస్థ నుంచి మరో సంస్థకు ఉద్యోగం మారినప్పుడు బ్యాంక్ అకౌంట్‌లు కూడా మారుతుంటాయి. పాత కంపెనీకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్‌ను పట్టించుకోవడం మానేస్తారు. ఇలాంటి అకౌంట్‌లకు సంబంధించి మోసాలు ఎక్కువగా జరుగుతాయని అంటున్నారు.
అదేవిధంగా ఒకటి కంటే ఎక్కువ పొదుపు ఖాతాలను కలిగి ఉంటే.. బ్యాంక్ ఖాతాలో సరైన మినిమిమ్ బ్యాలెన్స్ నిర్వహించడం మీకు కష్టమవుతుంది. అటువంటి సందర్భంలో పెనాల్టీకి గురయ్యే ఛాన్స్ ఉంటుంది. మీ సిబిల్‌పై కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంది. బ్యాంకు పొదుపు ఖాతా కోసం మినిమిమ్ బ్యాలెన్స్ నిర్వహించడం కూడా అవసరం. మీకు మల్టీపుల్ బ్యాంక్ అకౌంట్లు ఉంటే.. మీ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలో భారీ మొత్తంలో చిక్కుకునే అవకాశం ఉంది.
Also Read: IRCTC Package: ఐఆర్సీటీసీ నుంచి కొత్త ప్యాకేజ్, 14 వేలకే ఆధ్యాత్మిక ప్రదేశాాల పర్యటన
Also Read: Pakistan ODI Rank: వన్డే ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్ టీమ్‌గా పాకిస్థాన్.. భారత్ ర్యాంక్ ఎంతంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook