India Postal Rural Dak Sevak Recruitment 2025: ఇండియా పోస్టల్ గ్రామీణ డాక్ సేవక్ (GDS) నుంచి యువతకు గుడ్ న్యూస్.. కేవలం పదవ తరగతి చదువుకున్న అభ్యర్థుల కోసం ప్రత్యేకమైన నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా ఆంధ్ర, తెలంగాణ రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఉద్యోగాల వివరాలను వెల్లడించారు. అయితే ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
ఇండియా పోస్టల్ గ్రామీణ డాక్ సేవక్ (GDS) సంబంధించిన నోటిఫికేషన్ పూర్తి వివరాల్లోకి వెళితే.. మొత్తం 21,413 పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేశారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ లో కాళీ ఉన్న 1,215 ఉద్యోగాలకు దరఖాస్తు కోరారు. ఇక తెలంగాణకు సంబంధించిన 519 ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. ఈ పోస్టులకు అప్లై చేసుకునే వారి విద్యార్హతల వివరాల్లోకి వెళితే.. దీనిని అప్లై చేసుకునే అభ్యర్థులు తప్పకుండా పదో తరగతిలో ఉన్నతమైన మార్కులను పొందాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్లు భాగంగా గ్రామీణ్ డాక్ సేవక్, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ తో పాటు అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఉద్యోగులకు దరఖాస్తు కోరారు..
భారతదేశ పోస్టల్ గ్రామీణ్ డాక్ సేవక్ (GDS) రిక్రూట్‌మెంట్ లో భాగంగా విడుదల చేసిన ఉద్యోగాలకు అప్లై చేసుకునేవారు మార్చి మూడో తేదీ వరకు https://indiapostgdsonline.gov.in/ ఆన్‌లైన్‌లో తప్పకుండా దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. అయితే ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఎంపిక ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఉంటుంది.
Also read; 8th Pay Commission Salary Hike: ఉద్యోగుల జీతాలు ఎంత పెరుగుతున్నాయి. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎంత
ఇక ఎంపికైన వారి జీతాల వివరాల్లోకి వెళితే.. పోస్టల్ గ్రామీణ్ డాక్ సేవక్ సంస్థ ఈ ఉద్యోగాల్లో ఎంపికైన వారికి ప్రతి నెల రూ.18 వేలు ప్రారంభ జీతాన్ని అందించబోతున్నట్లు నోటిఫికేషన్ లో క్లుప్తంగా పేర్కొంది. అంతేకాకుండా వివిధ అలవెన్స్లను కూడా అందించబోతున్నట్లు తెలిపింది. ఇక ఈ ఉద్యోగాలకు సంబంధించిన పోస్టులను అప్లై చేసుకునే వారు తప్పకుండా ఆన్లైన్లో అప్లికేషన్ ఫీజ్ చెల్లించాల్సి ఉంటుంది.. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎవ్వరైనా తప్పకుండా రూ.100 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్సైట్ను సందర్శించండి..
Also read; 8th Pay Commission Salary Hike: ఉద్యోగుల జీతాలు ఎంత పెరుగుతున్నాయి. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎంత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి