Bank Holidays: ఫిబ్రవరి 28న బ్యాంకులు బంద్‌.. శాలరీ డే రోజు ఎందుకు సెలవు? పూర్తి వివరాలు తెలుసుకోండి.

Bank Holiday On February 28: బ్యాంకులు ప్రతి ఆదివారము, రెండో ,నాలుగో శనివారం బంద్ ఉంటాయి. ముఖ్యంగా బ్యాంకులలో ఆర్థిక లావాదేవీలు, క్యాష్ విత్‌డ్రా, డిపాజిట్ ఇతర పనుల కోసం ఖాతాదారులు వెళ్లాల్సి ఉంటుంది. అయితే ముందుగానే బ్యాంకులు బంద్ ఉంటాయా? పని చేస్తున్నాయని తెలుసుకోవాలి.. లేకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అయితే ఫిబ్రవరి 28వ తేదీ బ్యాంకు సెలవు ఉందా? ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం..

Written by - Renuka Godugu | Last Updated : Feb 22, 2025, 10:14 AM IST
Bank Holidays: ఫిబ్రవరి 28న బ్యాంకులు బంద్‌.. శాలరీ డే రోజు ఎందుకు సెలవు? పూర్తి వివరాలు తెలుసుకోండి.

Bank Holiday On February 28: ఫిబ్రవరి నెలలో దేశవ్యాప్తంగా బ్యాంకులకు కేవలం 14 రోజులు మాత్రమే పని చేస్తాయి. మిగతా రోజులు పండుగలు, ప్రత్యేక పర్వదినాల సందర్భంగా బ్యాంకులకు సెలవులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 28వ తేదీ కూడా బ్యాంకు పని చేస్తుందా? ఆరోజు శాలరీ డే కూడా కాబట్టి ఎక్కువ మంది ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. అయితే  చాలావరకు బ్యాంకులు పండుగలు లేదా ఇతర ప్రత్యేక దినాల్లో బ్యాంకులకు సెలవులు ప్రకటిస్తారు. కొన్ని ప్రాంతాల్లో స్థానిక పండుగలు ఆధారంగా బ్యాంకులకు సెలవులు వస్తే.. మరికొన్ని ఆర్బీఐ ఆదేశాల మేరకు ప్రత్యేకంగా సెలవులు ప్రకటిస్తారు.

అయితే బ్యాంకు ఖాతాదారులు ఏదైనా పని నిమిత్తం బ్యాంకులకు వెళ్లాల్సిన సమయంలో ముందుగా బ్యాంకులు పనిచేస్తున్నాయా? లేదా బంద్‌ ఉంటుందా? అని ముందుగానే తెలుసుకోవాలి. లేకపోతే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అయితే బ్యాంకుల బంద్‌ ఉన్నా కానీ ఏటీఎం, ఆన్లైన్ యూపీఐ సేవలు అందుబాటులో ఉంటాయి. అయితే పెద్ద మొత్తంలో డబ్బులు డిపాజిట్ చేయాలన్న లేదా విత్ డ్రా చేయాలన్నా తప్పకుండా బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అందుకే బ్యాంకులు పనిచేస్తున్నాయా? లేదా? అని ముందుగానే తెలుసుకోవాలి. అయితే ఫిబ్రవరి 28వ తేదీ బ్యాంకులు పనిచేస్తాయా ? ఎక్కడ బంద్‌ ఉంటాయి. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.

సాధారణంగా ప్రతి ఆదివారాలతో పాటు రెండో, నాలుగో శనివారం కూడా బ్యాంకులు పనిచేయవు. అయితే ఫిబ్రవరి 22వ తేదీ అంటే ఈరోజు నాలుగో శనివారం ఈరోజు బ్యాంకులు బంద్ ఉంటాయి. మరుసటి రోజు ఫిబ్రవరి 23 ఆదివారం కాబట్టి ఆ రోజు కూడా దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులకు సెలవులు ఉంటాయి. రెండు రోజులు బ్యాంకులు పనిచేయవు. ఇది కాకుండా మహాశివరాత్రి సందర్భంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది. ఫిబ్రవరి 26వ తేదీ మహాశివరాత్రి నిర్వహిస్తున్నారు. ఆరోజు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకులకు సెలవు ఉంటుంది.

ఇదీ చదవండి: కాలేజీలకు సెలవుల కుదింపు..  ఏప్రిల్ 1 నుంచే క్లాసులు పునః ప్రారంభం..  

మహా శివరాత్రి సందర్భంగా ముంబై, శ్రీనగర్, బెంగళూరు, రాంచి, జమ్మూ, భోపాల్ లక్నో రెండు తెలుగు రాష్ట్రాలు తో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా బ్యాంకులు బంద్ ఉంటాయి. ఈరోజు మహా శివుడికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తారు. కాబట్టి దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది. దీంతో పాటు విద్యాసంస్థలు కూడా బంద్ ఉంటాయి. అయితే ఫిబ్రవరి 28వ తేదీ సిక్కిం రాష్ట్రంలో సెలవు ఉంది. ఆ రోజు బెక్హామ్‌ సందర్భంగా బంద్ పాటిస్తున్నారు . ఇది టిబెటియన్ న్యూ ఇయర్ గా కూడా పాటిస్తారు. మిగతా ప్రాంతాల్లో బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయి.

ఇదీ చదవండి: ఎయిర్‌టెల్‌ రూ. 2249 VS రూ.1849 ప్లాన్‌.. ఈ ప్లాన్‌లో ఎక్కువ బెనిఫిట్స్‌ తెలుసా?  

అయితే మార్చి 24వ తేదీ బ్యాంకులన్నీ స్ట్రైక్ నిర్వహిస్తున్నాయి. తమకు 5 రోజుల పనిని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అన్ని బ్యాంకులు సంబంధించిన ఉద్యోగులు స్ట్రైక్ జరుపనున్నారు. ఈ నేపథ్యంలో 24, 25వ తేదీల్లో 48 గంటల పాటు బ్యాంకులు పనిచేయవు. యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ ఆఫ్ యూనియన్ పత్రిక నివేదిక కూడా విడుదల చేశారు
 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

 

Trending News