Maruti Suzuki: కారు కొందాం అని అనుకుంటున్నారా? ఇక మీకు మోత, వాత తప్పదు.. ధరలు పెంచిన దిగ్గజ సంస్థ!

Maruti Suzuki Car Prices : కొత్తగా కారు కొనుగోలు చేయాలనుకునే వారికి భారీ షాక్. కొత్త ఏడాది తొలి రోజు నుంచి ధరలు పెంచిన దిగ్గజ కంపెనీలు.. మరోసారి పెంపునకు రెడీ అవుతున్నాయి. ఈ ఎడాది వరుసగా రెండో నెల ధరల పెంపు ప్రకటన చేసింది. మారుతి సుజుకి పలు కార్లపై గరిష్టంగా రూ.32 వేల వరకు ధరలు పెంచుతున్నట్లు మారుతీ తెలిపింది.  ఆ వివరాలు చూద్దాం.

Written by - Bhoomi | Last Updated : Jan 23, 2025, 09:09 PM IST
Maruti Suzuki: కారు కొందాం అని అనుకుంటున్నారా? ఇక మీకు మోత, వాత తప్పదు.. ధరలు పెంచిన దిగ్గజ సంస్థ!

Maruti Suzuki Car Prices : మీరు కొత్త కారు కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే మీకు బ్యాడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఈ నెలాఖరులోపే కొనుగోలు చేస్తే భారీగా ఆదా చేసుకోవచ్చు. ఎందుకంటే దేశ దిగ్గజ కార్ల తయారీ కంపెనీ అయినా మారుతి సుజుకి మరోసారి ధరల పెంపు ప్రకటన చేసింది. ఈ ఏడాది జనవరి 1, 2025 నుంచి దాదాపు అన్ని మోడల్స్ పై ధరలు పెంచిన విషయం తెలిసిందే. ఇప్పుడు నెల రోజుల వ్యవధిలోనే మరోసారి ధరలు పెంచుతున్నట్లు ప్రకటించడం వినియోదారులకు ఊహించని షాక్ అనే చెప్పవచ్చు.

 అన్ని మోడల్స్ కార్ల పై ధరలు పెంచుతామని మారుతి సుజుకి తెలిపింది. గరిష్టంగా 32,500 వరకు ఈ ధరల పెంపు ఉంటుందని వెల్లడించింది. సవరించిన కొత్త ధరలో ఫిబ్రవరి 1, 2025 నుంచి అమల్లోకి వస్తాయని కంపెనీ స్పష్టం చేసింది.  అయితే తమ వినియోగదారులపై భారం మోపకూడదని భావించినప్పటికీ నిర్వాహణ తయారీ ఖర్చులు భారీగా పెరగడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నామని మారుతి సుజుకి వెల్లడించింది.

Also Read:Auto Expo: మార్కెట్‌లోకి కియా కొత్త కార్నివాల్‌.. అరేయ్‌ ఏముంది మావా.. ఫీచర్లు చూశారా?  

 అందుకే కొంత భారాన్ని వినియోగదారులకు బదిలీ చేయడం తప్ప వేరే ఆప్షన్ లేదని పేర్కొంది. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి పలు కార్ల ధరలు పెరుగుతాయని వెల్లడించింది. మరి ఏ కారుపై ఎంత పెరుగుతుందనేది ఈ జాబితా చూద్దాం.

 మారుతి సుజుకి కంపెనీకి చెందిన అత్యంత ప్రజాదారణ పొందిన కార్లలో సెలెరియో ఒకటి. ఈ కారు ధర ఫిబ్రవరి 1 నుంచి 32,500 పెరగనుంది. ఇక ప్రీమియం మోడల్ కారు ఇన్ విక్టో ధర  30 వేల వరకు పెరగనుంది. ఆ తర్వాత  , గ్రాండ్ విటారా కార్ల ధరలు వరుసగా 20వేల నుంచి 25 వేల వరకు పెరుగుతాయని కంపెనీ తెలిపింది. చిన్న కార్లలో ఆల్టో కే 10 ధర 19,500 పెరుగుతూ ఉండగా ఎస్ ప్రెస్సో కారు ధర 5000 పెరగనుంది.

 ప్రముఖ మోడల్ వ్యాగన్ఆర్ కారు ధర రూ. 15000 పెరగనుంది. అలాగే మారుతి సుజుకి స్విఫ్ట్ 5000 పెరగనుంది. ప్రీమియం కాంపాక్ట్ మోడల్ బలెనో కారు 9000 పెంచుతున్నట్లు మారుతి కంపెనీ తెరిపింది. కాంపాక్ట్ ఎస్ వి యు ఫ్రాంక్స్ ధర రూ.  5500 కాంప్లెక్స్ 10,000 వరకు పెంచుతున్నట్లు కంపెనీ తెలిపింది. ప్రస్తుతం మారుతి సుజుకి కంపెనీ భారతీయ మార్కెట్లో ఆల్టో కెన్ 10 నుంచి ఇన్విక్టో వరకు  విక్రయిస్తోంది. వీటి ధరలు 3.99 లక్షల నుంచి 28.9.2 లక్షల వరకు ఉన్నాయి

Also Read:Samsung Galaxy S25 series: దుమ్మురేపే ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ S25 లాంచ్.. ధర తెలిస్తే వెంటనే కొనేస్తారు  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News