8th Pay Commission: 8వ వేతన సంఘం ఏర్పాటుకై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎదురుచూస్తున్నారు. 8వ వేతన సంఘం ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన అందినట్టు తెలుస్తోంది. అంటే 8వ వేతన సంఘం ఏర్పాటులో కీలకమైన అడుగు పడింది. అసలేంటిది, ఈ 8వ వేతన సంఘం వల్ల కలిగే ప్రయోజనాలేంటి..
ప్రతి పదేళ్లకు కేంద్ర వేతన సంఘం ఏర్పడుతుంటుంది. ప్రభుత్వ ఉద్యోగుల, జీతాలు, అలవెన్సులు, ఇతర సౌకర్యాలు, ప్రయోజనాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ నిర్ణయాలు తీసుకుంటుంది. ఉద్యోగుల డీఏ పెంపు కూడా ఈ వేతన సంఘం సిఫారసుల మేరకే ఉంటాయి. జీతభత్యాలు, అలవెన్సులు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సేవలు, వంటివాటిని ఎప్పటికప్పుడు సమీక్షించే విధంగా శాశ్వతమైన వ్యవస్థ ఉండాలని 3,4,5వ వేతన సంఘాలు సిఫారసు చేశాయి. తాజాగా ఇండియన్ రైల్వేస్ టెక్నికల్ సూపర్ వైజర్స్ అసోసియేషన్ కేంద్రానికి రాసిన లేఖ ద్వారా కొన్ని డిమాండ్లు ప్రస్తావించింది. కొత్త కేంద్ర వేతన సంఘం ఏర్పాటు చేయాలనేది మొదటి డిమాండ్. వివిధ వర్గాల ఉద్యోగుల మధ్య ఉన్న జీత భత్యాల తేడా ఇతర విషయాల్ని పరిష్కరించాలని కోరింది.
8వ వేతన సంఘం ఏర్పాటుతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంపు, జీతం పెంపుపై ప్రభావం పడనుంది. వివిధ ఉద్యోగ వర్గాల జీత భత్యాలు ఇతర సౌకర్యాల్లో ఉన్న అంతరాలు పరిష్కరించేందుకు కొత్త వేతన సంఘం ఏర్పాటు అవసరం. రైల్వే టెక్నికల్ ఉద్యోగుల అసోసియేషన్ రాసిన లేఖ ద్వారా ఉద్యోగుల జీతభత్యాలు, అలవెన్సులు, వర్కింగ్ కండీషన్స్, ప్రొమోషనల్ మార్గదర్శకాలు వంటివాటిపై విధివిదానాలు రూపొందించాల్సి ఉంది. ఈ అన్నింటికీ మార్గం 8వ వేతన సంఘం ఏర్పాటు అని లేఖలో ప్రస్తావించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook