Visakhapatnam: జగన్ నిజంగా గట్స్ ఉన్న నాయకుడు: టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్

ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంకు గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ జగన్ పై ప్రశంసలు కురిపించారు. ఆయన ఇద్దరు కుమారులు పార్టీ తీర్ధం పుచ్చుకోగా..జగన్ గట్స్ ఉన్న నాయకుడని గణేష్ ప్రశంసించారు.

Last Updated : Sep 19, 2020, 05:07 PM IST
  • ఏపీ సీఎం వైఎస్ జగన్ ను కలిసిన విశాఖ దక్షిణం టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్
  • ఎమ్మెల్యే వాసుపల్లి ఇద్దరు కుమారుల్ని పార్టీలో ఆహ్వానించిన జగన్
  • జగన్ గట్స్ ఉన్న నాయకుడంటూ ప్రశంసించిన ఎమ్మల్యే గణేశ్
Visakhapatnam: జగన్ నిజంగా గట్స్ ఉన్న నాయకుడు: టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్

ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం ( Telugu Desam ) కు గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ జగన్ పై ప్రశంసలు కురిపించారు. ఆయన ఇద్దరు కుమారులు పార్టీ తీర్ధం పుచ్చుకోగా..జగన్ గట్స్ ఉన్న నాయకుడని గణేష్ ప్రశంసించారు.

ఉత్తరాంధ్ర టీడీపీకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ పార్టీ విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం ( Visakha south ) నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వాసుపల్లి గణేశ్ ( Tdp Mla vasupalli ganesh ) ఇవాళ సీఎం జగన్ ను ( ap cm ys jagan ) కలిశారు. తన ఇద్దరు కుమారుల్ని వైసీపీలో చేర్పించారు. జగన్ నిజంగా గట్స్ ఉన్న నాయకుడంటూ ప్రశంసించారు. జగన్ ధైర్యమే  రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తోందని…అనేక సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అందరికీ అందుతున్నాయన్నారు విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్. విశాఖకు ఎగ్జిక్యూటివ్ కేపిటల్ ( Visakha as executive capital ) ఇచ్చిన ఘనత జగన్ దని...ఇక మున్ముందు కూడా టీడీపీ రాణిస్తుందని తనకు అన్పించడం లేదన్నారు. 

తెలుగుదేశం పార్టీకు చెందిన చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం ( Chirala mla karanam Balaram ), గుంటూరు ఎమ్మెల్యే మద్దాల గిరి ( Guntur mla Maddala giri ), గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ( Gannavaram mla vallabhaneni vamsi ) ఇప్పటికే టీడీపీకు దూరంగా ఉంటూ వైసీపీ ( ysrcp ) కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు. పార్టీలో చేరకపోయినా ప్రభుత్వ పనితీరును ఎప్పటికప్పుడు మెచ్చుకుంటున్నారు. ఇప్పుడు అదే కోవలో వచ్చి చేరారు టీడీపీ మరో ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్. వాసుపల్లి గణేష్ గత కొద్దిరోజులుగా టీడీపీ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటున్నారు. ముఖ్యంగా విశాఖ రాజధానిని టీడీపీ వ్యతిరేకించినప్పటి నుంచి ఆయన టీడీపీ పట్ల విముఖత చూపిస్తున్న సంగతి తెలిసిందే. 

విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి కుమారులిద్దరూ పార్టీలో చేరడం, స్వయంగా ఎమ్మెల్యేనే సీఎం జగన్ ను కీర్తిస్తుండటం ఉత్తరాంధ్ర టీడీపీ వర్గాలు మింగుడుపడటం లేదు. వాసుపల్లి కుటుంబం ప్రజల కోసం చేస్తున్న సేవలు హర్షణీయమని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ( ycp mp vijayasai reddy ) తెలిపారు. సీఎం జగన్ చేస్తున్న అభివృద్ధి చూసి టీడీపీలోని విద్యావంతులంతా పార్టీలో చేరుతున్నారన్నారు. విశాఖలో తెలుగుదేశం పార్టీ తుడుచుపెట్టుకుపోతుందనడంలో సందేహం లేదన్నారు విజయసాయి రెడ్డి. అసలు రాష్ట్రంలో ప్రతిపక్షమనేది ఉంటే కదా..ప్రతిపక్ష నాయకుడుండేదంటూ ఆయన ఎద్దేవా చేశారు. Also read: Antarvedi: నూతన రథం నిర్మాణ పనులు ప్రారంభం

Trending News