TTD Receives Rs 5.41 Crore Hundi Income on February 25th: కరోనా వైరస్ మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా ప్రపంచమంతా అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. వైరస్ ప్రభావం అన్ని రంగాలపై పడింది. ఈ క్రమంలోనే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి హుండీ ఆదాయంపై కూడా ప్రభావం చూపింది. కరోనా ఆంక్షల కారణంగా శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య భారీగా తగ్గిపోవడంతో.. హుండీ ఆదాయం కూడా పడిపోయింది. అయితే ఇటీవల కేసుల సంఖ్య భారీగా తగ్గిపోవడంతో.. శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. దాంతో హుండీ ఆదాయం కూడా పెరుగుతూ వస్తోంది.
తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామిని శుక్రవారం (ఫిబ్రవరి 25) 56,559 మంది భక్తులు దర్శించుకోగా.. 28,751 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. అదే సమయంలో శ్రీవారికి భారీ స్థాయిలో కానుకలు ఇచ్చుకున్నారు. దాంతో శుక్రవారం శ్రీవారి హుండీ ఆదాయం ఓ రికార్డు సృష్టించింది. స్వామివారికి నిన్న ఒక్కరోజే రూ.5.41 కోట్ల హుండీ ఆదాయం వచ్చినట్టు టీటీడీ అధికారులు ప్రకటించారు.
2012 ఏప్రిల్ 1వ తేదీన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామికి అత్యధికంగా రూ. 5.73 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది. ఇప్పటివరకు కూడా ఇదే శ్రీవారి హుండీ ఆదాయంలో అత్యధిక రికార్డుగా ఉంది. శుక్రవారం ఆదాయం ఆ రికార్డుకు దరిదాపుగా వచ్చింది. నిన్నటి శుక్రవారం నమోదైన హుండీ ఆదాయం (రూ.5.41 కోట్ల) రెండో అత్యధిక రికార్డుగా నిలిచింది. అంటే.. 10 ఏళ్ల తర్వాత ఇప్పుడే అత్యధిక హుండీ ఆదాయం నమోదైంది.
Also Read: Gold Rate Today 26 February 2022: మగువలకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు!!
Also Read: Petrol Prices Hikes: సామాన్యులపై పెట్రో మంట.. లీటర్ పెట్రోల్ @రూ.150
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook
TTD Hundi Income: రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం.. 10 ఏళ్ల తర్వాత ఇప్పుడే!!
రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం
శ్రీవారి హుండీ ఆదాయం మరో రికార్డు
10 ఏళ్ల తర్వాత ఇప్పుడే