Andhra Pradesh News: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu) పర్యటించారు. కల్తీ మద్యం తాగి మృతి చెందిన వారు కుటుంబాలను పరామర్శించారు. అంతేకాకుండా సీఎం జగన్ (CM Jagan) పై విమర్శలు చేశారు. ఎన్నికల్లో మద్యపాన నిషేధం అమలు చేస్తామని చెప్పిన జగన్ సర్కారు పాలనలో రాష్ట్రంలో మద్యం, నాటుసారా ఏరులై పారుతోందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీసారాను వైకాపా నేతలే విక్రయిస్తున్నారని ఆయన ఆరోపించారు. పొరుగు రాష్ట్రాల నుంచి మద్యాన్ని ఇక్కడకు తెచ్చి అధిక ధరకు అమ్ముతున్నారని విమర్శించారు.
కల్తీ సారా తాగి చనిపోయిన మృతులు కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని చంద్రబాబు డిమాండ్ చేశారు. కల్తీ సారాను అరికట్టే వరకు తమ పోరాటం కొనసాగుతోందని స్పష్టం చేశారు. ఒక్కో కుటుంబానికి రూ.లక్ష చొప్పున మెుత్తం 26 కుటుంబాలకు సాయం చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు. తమపై ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook