YS Jagan Donation: భారీ వర్షాలతో విలవిలలాడుతున్న ఆంధ్రప్రదేశ్ వరద బాధితులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అండగా నిలిచారు. ఇప్పటికే విజయవాడలో పర్యటించి వరద బాధితులను పరామర్శించారు. వారి కష్టాలు కళ్లారా చూసి చలించిపోయిన మాజీ సీఎం జగన్ వారికి ఏదైనా సహాయం చేయాలని తాపత్రయపడ్డారు. ఏపీ ప్రభుత్వం సహాయ చర్యల్లో విఫలమైందని ఆరోపించిన ఆయన పార్టీ తరఫున భారీ విరాళం ప్రకటించారు.
Also Read: YS Sharmila: 'ఇద్దరు బిడ్డలు ఉన్న జగన్ ఇంత నీచానికి పాల్పడతారా? వైఎస్ షర్మిల ఆగ్రహం
తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం పార్టీ సీనియర్ నేతలు, ఎన్టీఆర్ జిల్లా పార్టీ నాయకులతో మాజీ సీఎం జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వరద పరిస్థితులపై నాయకులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. రాష్ట్రంలో వరద పరిస్థితులపై సమీక్షించారు. 'వరద ముంచెత్తిన ప్రాంతాల్లో ప్రభుత్వం ఎలాంటి సహాయ కార్యక్రమాలు చేపట్టడం లేదని, లక్షలాది మంది కనీసం ఆహారం, తాగునీరు కూడా దొరక్క నానా ఇబ్బంది పడుతున్నారు' అని జగన్ తెలిపారు.
Also Read: Pawan Kalyan: పత్తా లేని పవన్ కల్యాణ్.. ఏపీ ఆపదలో ఉంటే సంబరాల్లో డిప్యూటీ సీఎం?
ప్రచార ఆర్భాటం తప్ప వాస్తవంగా బాధితులకు ఎలాంటి సహాయ చర్యలు లేవని సమావేశంలో చర్చ జరిగింది. వరద ప్రాంతాల్లో షో చేస్తూ.. ఫొటోలకు ఫోజులు ఇస్తూ సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారని తెలిపారు. వరద బాధితులు అనారోగ్యం పాలవుతున్నా.. వారికి మందులు కూడా లభించడం లేదని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. పాలు కూడా దొరక్క దుర్భర పరిస్థితులు ఉన్నాయని వాపోయారు.
వరద బాధితుల పడుతున్న కష్టాలను స్వయంగా చూశానని సమావేశంలో జగన్ తెలిపారు. బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఘోర తప్పిదంతో ఈ విపత్తు సంభవించిందని ఆరోపించారు. వరద బాధితుల కోసం పార్టీ తరపున కోటి రూపాయల సాయం ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. అయితే ప్రకటించిన సహాయ ఎలా ఇస్తారనేది చర్చనీయాంశంగా మారింది. ప్రకటించిన రూ.కోటి ఏ రూపంలో.. ఎలా ఇవ్వాలనేది త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter