AP Assembly Budget Session: అధికారం కోల్పోయిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరు కావాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆ నిర్ణయంపై యూటర్న్ తీసుకున్నారు. అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలని మాజీ సీఎం నిర్ణయించారు. తనతోపాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులందరూ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానున్నారు. అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకపోతే శాసన సభ్యత్వాలు రద్దయే ప్రమాదం ఉండడంతో ఈ మేరకు వైఎస్సార్సీపీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
Also Read: APPSC Group 2 Mains: ఏపీ ప్రభుత్వం న్యాయ సలహా.. గ్రూపు 2 మెయిన్స్ పరీక్షలు వాయిదా
ఈనెల 24వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ సందర్భంగా నిర్వహిస్తున్న సమావేశాలకు ఎన్డీయే సభ్యులు హాజరవుతుండగా.. వైఎస్సార్సీపీ గైర్హాజరు కావాలని నిర్ణయించింది. అధికారం కోల్పోయిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు కేవలం శాసనసభ్యులుగా ప్రమాణస్వీకారం చేసేందుకు మాత్రమే అసెంబ్లీకి వచ్చారు. అనంతరం జరిగిన అసెంబ్లీ సమావేశాలకు వైఎస్సార్సీపీ పూర్తి దూరంగా ఉంది.
Also Read: APPSC Group 2 Mains: రేపే ఏపీ గ్రూపు 2 పరీక్ష.. వాయిదా కోసం నిరుద్యోగుల ఆందోళన ఉధృతం
తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని.. సాధారణ ఎమ్మెల్యేగానే తనకు సమయం కేటాయిస్తే అసెంబ్లీలో గళం వినిపించలేమని మాజీ సీఎం వైఎస్ జగన్ పేర్కొంటున్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీ సమావేశాలకు వెళ్తామని ప్రకటించారు. అయితే కూటమి ప్రభుత్వం అంగీకరించడం లేదు. 11 మంది సభ్యులు ఉంటే ఎలా ప్రతిపక్ష హోదా ఇస్తామని ఎన్డీయే పక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ వివాదం కొనసాగుతున్న సమయంలో జరిగిన అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం వైఎస్ జగన్, వైసీపీ సభ్యులు హాజరుకాని విషయం తెలిసిందే.
తాజాగా ఎల్లుండి నుంచి జరగనున్న బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలని వైఎస్సార్సీపీ నిర్ణయం తీసుకుంది. వరుసగా 60 రోజుల పాటు అసెంబ్లీకి హాజరు కాకపోతే సభ్యత్వాలు రద్దయ్యే ప్రమాదం ఉంది. దీంతో ఒక్కరోజు అసెంబ్లీకి వెళ్లి రావాలనే యోచనలో వైసీపీ ఉన్నట్లు సమాచారం. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.