AP DSC 2024: నిరుద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. సంక్రాంతి తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్..

AP Jobs 2024: ఏపీ నిరుద్యోగులకు సంక్రాంతి కానుకను ప్రకటించింది వైసీసీ సర్కారు. పండుగ తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 13, 2024, 09:08 PM IST
AP DSC 2024: నిరుద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. సంక్రాంతి తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్..

AP DSC Notification 2024: నిరుద్యోగులకు జగన్ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతి తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శనివారం ప్రకటించారు. ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉంటాయనేది త్వరలో తెలియజేయనున్నారు. డీఎస్సీ గురించి ఇప్పటికే సీఎం జగన్‌తో చర్చించామని..పోస్టుల సంఖ్య ఎంత అనేది త్వరలోనే చెబుతామని  మంత్రి పేర్కొన్నారు. ఉద్యోగాల భర్తీపై విధి విధానాలను త్వరలోనే ప్రకటిస్తామని ఆయన అన్నారు. మరోవైపు శనివారం వైసీపీ అభ్యర్థుల 4వ జాబితా విడుదల ఉంటుందనే ప్రచారాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ తోసిపుచ్చారు. ఇప్పుడు ఎలాంటి ప్రకటన లేదని.. ఏదైనా ఉంటే చెబుతామని ఆయన స్పష్టం చేశారు.

ఇప్పటికే గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల భర్తీకి గత డిసెంబరులో నోటిఫికేషన్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. 897 గ్రూప్ 2 పోస్టులకు సంబంధించి డిసెంబరు 21వ తేదీ నుంచి జనవరి 10 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అయితే వెబ్ సైట్ లో సాంకేతిక లోపం తలెత్తడంతో గడువును జనవరి 17 వరకు పెంచారు. మరోవైపు 89 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఏడాది జనవరి 01 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. జనవరి 21 వరకు అప్లికేషన్స్ ను నిర్వహించనున్నారు. పూర్తి వివరాలను ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ లో చెక్‌ చేసుకోవచ్చు.

Also Read: 7th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు సర్‌ప్రైజ్ న్యూస్.. ఒకేసారి జీతంలో రూ.8 వేలు పెంపు..!

Also Read:Ayodhya Ram mandir: అయోధ్యలో ఆకాశాన్నంటిన హోటళ్ల ధరలు.. ఏకంగా 500 శాతం పెరిగిన రేట్లు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

 

Trending News