రానున్న 24 గంటల్లో తమిళనాడు, దక్షిణకోస్తాంధ్రలో భారీ వర్షాలు

రానున్న 24 గంటల్లో తమిళనాడు, దక్షిణకోస్తాంధ్రలో భారీ వర్షాలు

Last Updated : Apr 27, 2019, 06:46 PM IST
రానున్న 24 గంటల్లో తమిళనాడు, దక్షిణకోస్తాంధ్రలో భారీ వర్షాలు

హైదరాబాద్‌: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా మారింది. మరో 24 గంటల్లో పెనుతుపానుగా మారే అవకాశం ఉండటంతో తుపాను ప్రభావంతో రానున్న 24 గంటల్లో తమిళనాడు, దక్షిణకోస్తాంధ్ర జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. శ్రీహరికోటకు అగ్నేయ దిశలో 1423 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 1460 కిలోమీటర్ల తూర్పు దిశగా కేంద్రీకృతమైన తుపాను ప్రస్తుతం 45 కిలో మీటర్ల వేగంతో తీరంవైపు  కదులుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. 

తుపాన్ ఈనెల 30 నాటికి తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరాన్ని సమీపించవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదిలావుంటే, మరోవైపు ఏపీలోని ఆర్టీజీఎస్‌, వాతావరణ శాఖ కేంద్రాలు తుపాను గమనాన్ని నిశితంగా పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు తుపాన్ ప్రభావిత ప్రాంతాలకు చెందిన సంబంధిత అధికారులను అప్రమత్తం చేసే పనిలో నిమగ్నమయ్యాయి. ఇప్పటికే ఈ తుపాన్‌కి ఫణి అని నామకరణం చేసిన సంగతి తెలిసిందే.

Trending News