Allu Arjun Row: అల్లు సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ అరెస్టయి జైలుకు వెళ్లి బెయిల్‌పై రావడంతో ఆ అంశం ముగిసిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. మళ్లీ ఆ సమస్యపై అసెంబ్లీ వేదికగా మాట్లాడేది ఏముందని ప్రశ్నించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. అందులో రేవంత్ రెడ్డిని పొగడాల్సిన పని ఏముందని సందేహం వ్యక్తం చేశారు. 'పవన్ కల్యాణ్ ఏమన్నారో నాకు తెలియదు. నేను వినలేదు. నిజంగా గొప్ప నాయకుడని అని ఉంటే రేవంత్ రెడ్డిలో ఏం కనిపించిందో' అని ఎద్దేవా చేశారు.
Also Read: Harish Rao: హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు.. కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్‌ను కంటతడి పెట్టించింది
రేవంత్ రెడ్డి గొప్ప వ్యక్తి అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ కేంద్ర మంత్రి బండి సంజయ్ పరోక్షంగా తప్పుబట్టారు. '6 గ్యారంటీలను అమలు చేయలేదు. ఇచ్చిన హామీలను ఏవీ అమలు చేయలేదు? క్రైం రేటు పెరిగింది. మరి రేవంత్ రెడ్డిలో గొప్ప నాయకుడు ఎలా కనిపించారో వారికే తెలియాలి' అని పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి బండి సంజయ్ పేర్కొన్నారు. 'మళ్లీ అసెంబ్లీలో మరే సమస్య లేనట్లు ఈ అంశంపై గంటల తరబడి చర్చ జరపాల్సిన అవసరం ఏముంది?' అని కేంద్ర మంత్రి ప్రశ్నించారు.
Also Read: Telangana Assembly: కేటీఆర్ సంచలనం.. తొలిసారి రేవంత్ రెడ్డికి సంపూర్ణ మద్దతు
6 గ్యారంటీలపై చర్చ జరగకుండా దారి మళ్లించాలనే రేవంత్ రెడ్డి కుట్రలో భాగమే అల్లు అర్జున్ వ్యవహారం అని బండి సంజయ్ స్పష్టం చేశారు. 'నాకు తెలిసి రేవంత్ రెడ్డికి, అల్లు అర్జున్‌కు మధ్య ఏదో చెడింది. పుష్ప 2 సినిమాకు రూ.1,700 కోట్ల రూపాయలు వచ్చాయి. పుష్ప 2 సినిమా ఇంకా ప్రారంభం కాలేదు. కానీ పుష్ప 3 సినిమా చూపించారు' అని తెలిపారు. 'అల్లు అర్జున్‌పై కేసును మృతురాలి భర్త వెనక్కి తీసుకుంటానని చెప్పాక ఇంకా దీనిపై ఎందుకు రాద్దాంతం చేస్తున్నారు' అని ప్రశ్నించారు.
ఎన్డీయే మిత్రపక్షంపై విమర్శలు కలవరం
అల్లు అర్జున్ వ్యవహారంలో రేవంత్ రెడ్డి చేసిన పనిని బీఆర్‌ఎస్ పార్టీతోపాటు బీజేపీ తప్పుబడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ స్పందించడంతో రాజకీయంగా మరోసారి హాట్ టాపిక్‌గా ఈ వ్యవహారం మారింది. ఎన్డీయే కూటమిలో ఉన్న జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఖండించడం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. ఎన్డీయే కూటమి నాయకుడి వ్యాఖ్యలను తప్పుబట్టడంతో ఎన్డీయే పక్షాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. అల్లు అర్జున్ వ్యవహారం ఎన్డీయే కూటమిలో చీలిక తీసుకురానుందా? అనే చర్చ జరుగుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.