74th Independence Day: ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రసంగం హైలైట్స్

ఏపీ సీఎం వైఎస్ జగన్ ( AP CM YS Jagan ) విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జాతీయ జెండాను ఆవిష్కరించి 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ( 74th Independence Day ) ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ 74వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

Last Updated : Aug 15, 2020, 09:34 PM IST
  • విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన ఏపీ సీఎం వైఎస్ జగన్ ( AP CM YS Jagan ).
  • రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ 74వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం వైఎస్ జగన్.
  • సాయుధ దళాల నుండి గౌరవ వందనం స్వీకరించిన సీఎం జగన్
  • అనంతరం ఏర్పాటు చేసిన సభలో రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు.
  • ఆర్ధిక పరిస్థితులు సహకరించకున్నా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేయడంలో రాజీపడటం లేదని స్పష్టంచేసిన సీఎం జగన్
74th Independence Day: ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రసంగం హైలైట్స్

విజయవాడ: ఏపీ సీఎం వైఎస్ జగన్ ( AP CM YS Jagan ) విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జాతీయ జెండాను ఆవిష్కరించి 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ( 74th Independence Day ) ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ 74వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పరేడ్‌లో సాయుధ దళాల నుండి సీఎం జగన్ గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై ప్రభుత్వ సంక్షేమ పథకాల శకటాలను సందర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ప్రత్యేకతలను ప్రతిబింభించేలా ఏర్పాటు చేసిన శకటాలతో పాటు  కరోనావైరస్ ( Coronavirus ) వ్యాపిస్తున్న ప్రస్తుత తరుణంలో వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది అందించిన సేవలకు గుర్తింపుగా ఏర్పాటు చేసిన శకటాలు ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ''స్వాతంత్ర్య సమరయోధులకు పాదాభివందనాలు తెలియజేశారు. స్వాతంత్ర్యం ప్రాణవాయువు లాంటిదని గాంధీజీ చెప్పిన మాటలను సీఎం జగన్ గుర్తుచేశారు. Also read: Aatmanirbhar Bharat: ఆత్మనిర్భర్ భారత్ ప్రయోజనాలపై ప్రధాని మోదీ కీలక ప్రసంగం

CM YS Jagan speech highlights సీఎం జగన్‌ ప్రసంగంలోని ముఖ్యాంశాలు :

  • అందరికీ సమానమైన ఆర్థిక స్వేచ్ఛ కోసమే రైతు భరోసా, వైఎస్ఆర్ చేయూత, అమ్మఒడి, ఆసరా పథకాలు ప్రవేశపెట్టాం.
  • కులం, మతం, పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతీ ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నాం
  • ఆర్ధిక పరిస్థితులు సహకరించకున్నా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేయడంలో రాజీపడటం లేదు.
  • నిరుపేదలకు ఖరీదైన విద్యను ఉచితంగా అందించడం కోసమే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాం.
  • 100 శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేస్తున్నాం.
  • పిల్లల ఎదుగుదల, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకమైన మెనూతో గోరుముద్ద పథకం అమలు చేస్తున్నాం.
  • కంటి వెలుగు కార్యక్రమం ద్వారా విద్యార్ధులకు కంటి పరీక్షలు చేస్తున్నాం.
  • రైతు భరోసా ద్వారా రైతన్నలకు ఆర్ధిక సహాయం అందిస్తున్నాం.
  • పేదలకు 30 లక్షల ఇళ్ల పట్టాలు అందిస్తున్నాం.
  • రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేసేందుకే పాలనా వికేంద్రీకరణ కోసం మూడు రాజధానుల బిల్లుకు చట్టరూపం కల్పించాం.
  • విశాఖ కేంద్రంగా త్వరలోనే కార్యనిర్వాహక రాజధాని.
  • కర్నూలు కేంద్రంగా న్యాయ రాజధాని ఏర్పాటుకు త్వరలోనే చర్యలు.
  • పార్లమెంట్ సాక్షిగా కేంద్రం ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని నిలబెట్టుకోవాల్సిందిగా ఎప్పటికప్పుడు కేంద్రాన్ని గట్టిగా అడుగుతూనే ఉంటాం.
  • కేంద్ర ప్రభుత్వానికి మిగతా పార్టీలపై ఆధారపడాల్సిన అవసరం లేదు కనుక ఇప్పటికిప్పుడు హోదా ఇచ్చే అవకాశం కనిపించడం లేదు. అయినప్పటికీ ప్రత్యేక హోదాను సాధించేందుకు ఏపీ సర్కార్ కృషి చేస్తూనే ఉంటుంది.
  • అవినీతిని నిర్మూలించే ప్రయత్నాల్లో భాగంగానే రివర్స్ టెండరింగ్‌, జ్యుడీషియల్ ప్రివ్యూ, డైరెక్ట్‌ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ విధానాన్ని తీసుకొచ్చి రూ.4వేల కోట్లకు పైగా ప్రజాధనాన్ని ఆదా చేశాం.
  • అధికారం చేపట్టిన తొలి 14 నెలల్లోనే వివిధ సంక్షేమ పథకాల ద్వారా దాదాపు రూ.46వేల కోట్లు ప్రజలకు నేరుగా అందించాం.
  • ప్రభుత్వం చేస్తున్న వ్యయానికి పూర్తిస్థాయి ఫలాలు మరో 10 నుంచి 20 ఏళ్లకు వస్తాయి. ఇవి అన్ని ప్రభుత్వాలు తీసుకొచ్చే ఎన్నికల పథకాలు కావు.
  • రాష్ట్ర ప్రజల సామాజిక, ఆర్ధిక రాజకీయ చరిత్రలో మెరుగైన మార్పుల కోసం.. బాధ్యతతో, మనసుతో అమలు చేస్తున్న పథకాలు.
  • రూ.5లక్షల లోపు ఆదాయం ఉన్న ప్రతి కుటుంబానికి ఆరోగ్యశ్రీ వర్తింపజేశాం. 
  • ఏపీలోనే కాకుండా బెంగళూరు, హైదరాబాద్‌, చెన్నై నగరాల్లోనూ ఆరోగ్యశ్రీ పథకం కింద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్‌లో పేదలకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నాం.
  • రాష్ట్ర వ్యాప్తంగా 1088 వాహనాలను ఒకేసారి 108, 104 సేవల కోసం వినియోగంలోకి తీసుకొచ్చాం.
  • శస్త్రచికిత్స చేయించుకున్న రోగులకు అండగా నిలుస్తూ వారికి రూ.5వేలు ఆరోగ్య ఆసరా అందిస్తున్నాం.
  • దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు రూ.10వేల పింఛన్ అందిస్తున్నాం.
  • కొత్తగా 16 మెడికల్ కాలేజీల నిర్మాణానికి నిర్ణయం.
  • 2022 ఖరీఫ్ నాటికి పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేసే దిశగా చర్యలు.
  • రాష్ట్రానికి రావాల్సి ఉన్న నీటి వాటాను పొందడంలో ఎలాంటి రాజీనామా లేని పోరాటం చేస్తున్నాం. 
  • ఉత్తరాంధ్ర ప్రజల ఆకలి తీర్చే సుజల స్రవంతి, పల్నాడు కరువు నివారణ ప్రాజెక్టుతో పాటు రాయలసీమ కరువు తీర్చే నివారణ ప్రాజెక్ట్‌ల పనులు మొదలుపెట్టబోతున్నాం.
  • వంశధార ఫేజ్‌-2, వంశధార-నాగావళి నదుల అనుసంధానం దిశగా చర్యలు. 
  • వెలిగొండ ఫేజ్‌-1, అవుకు టన్నెల్‌ -2, సంగం బ్యారేజ్‌, నెల్లూరు బ్యారేజీల్ని పూర్తి చేసేందుకు చర్యలు. Also read: Patriotic songs: దేశ భక్తిని తట్టిలేపే టాప్ 10 బాలీవుడ్ పేట్రియాటిక్ సాంగ్స్

Trending News