అమరావతి: రాష్ట్రంలో ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలతో దూసుకెళ్తున్న ఆంధ్రప్రదేశ్, తాజాగా "జగనన్న వసతి దీవెన" అనే పధకం ద్వారా రేపు (సోమవారం) నాడు విజయనగరం జిల్లా వేదిక కానుంది. ఉదయం 9.10 గంటలకు తాడేపల్లి నుంచి సీఎం బయలుదేరనున్నారని, సుమారు ఉదయం 11 గంటలకు విజయనగరం పోలీస్ ట్రైనింగ్ కళాశాల చేరుకోనున్నారని తెలిపారు.
అదే విదంగా, విజయనగరం అయోధ్యా మైదానంలో వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం జగన్ పరిశీలించనున్నారని, 11.25 వైయస్సార్ జగనన్న వసతి దీవెన పథకాన్ని ప్రారంభించి అనంతరం బహిరంగసభలో సీఎం ప్రసంగించనున్నట్లు తెలిపారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహిళల రక్షణకై తీసుకువచ్చిన "ఏపీ దిశా చట్టం 2020" నేపథ్యంలో పోలీస్ బారెక్ గ్రౌండ్స్‌లో నిర్మించిన దిశా పోలీస్ స్టేషన్‌ను ప్రారంభం ముగియగానే, మధ్యాహ్నం 1.05 గంటలకు విజయనగరం నుండి తాడేపల్లి చేరుకోనున్నట్లు సీఎంఓ వర్గాలు తెలిపాయి. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
జగన్ ప్రభుత్వం.. మరో అద్భుతం..