AP SSC Exams: ఏపీ పదో తరగతి పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల, చివరి తేదీ ఎప్పుడంటే

AP SSC Exams: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షల అప్‌డేట్ వెలువడింది. పరీక్ష ఫీజు షెడ్యూల్ విడుదలైంది. పదో తరగతి పరీక్షల ఫీజు ఎంత, ఎప్పటిలోగా చెల్లించాలనే వివరాలు తెలుసుకుందాం. ఈ మేరకు ఏపీ విద్యా శాఖ ప్రకటన విడుదల చేసింది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 26, 2024, 11:17 AM IST
AP SSC Exams: ఏపీ పదో తరగతి పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల, చివరి తేదీ ఎప్పుడంటే

AP SSC Exams: ఏపీలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు షెడ్యూల్‌ను ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ విడుదల చేసింది. అక్టోబర్ 28 నుంచి నవంబర్ 11 వరకూ పదో తరగతి పరీక్షల ఫీజులు వసూలు చేయనున్నారు. జరిమానాతో అయితే నవంబర్ 30 వరకూ చెల్లించవచ్చు. ఫీజు వివరాలు ఇలా ఉన్నాయి. 

ఏపీలో 2024-25 విద్యా సంవత్సరం పదో తరగతి పరీక్షల ఫీజు షెడ్యూల్ వచ్చేసింది. రెగ్యులర్ విద్యార్ధులు 125 రూపాయలు చెల్లించాలి. సప్లిమెంటరీ విద్యార్ధులయితే 3 పేపర్లకు 110 రూపాయలు చెల్లించాలి. 3 పేపర్ల కంటే ఎక్కువ రాస్తుంటే 125 రూపాయలు చెల్లించాలి. వయస్సు తక్కువగా ఉండి పరీక్షలు రాస్తుంటే 300 రూపాయలు ఫీజు చెల్లించాలి. అక్టోబర్ 28 నుంచి నవంబర్ 11 వరకూ చెల్లించేందుకు సమయం ఉంది. ఇక లేటు ఫీజు 50 రూపాయలతకో నవంబర్ 12 నుంచి నవంబర్ 18 వరకూ చెల్లించవచ్చు. నవంబర్ 19 నుంచి 25 వరకూ అదనంగా 200 రూపాయలు చెల్లించాలి. ఇక నవంబర్ 26 నుంచి  30 వరకూ అయితే లేటు ఫీజు 500 రూపాయలు చెల్లించాలి. 

ఈ విద్యా సంవత్సరం నుంచి కొత్త సిలబస్‌లో పరీక్షలు జరగనున్నాయి. ఇందులో భాగంగా విద్యార్ధుల అవగాహన కోసం వెబ్‌సైట్‌లో ప్రశ్నాపత్రాలు, మోడల్ పేపర్లు, మార్కుల వెయిటేజ్ అందుబాటులో ఉన్నాయి. 2021-22, 2022-23, 2023-24 విద్యా సంవత్సరాల్లో పదో తరగతి చదివి ఫెయిల్ అయినవారికి పాత సిలబస్ ప్రకారమే పరీక్షలు ఉంటాయి. కొత్త సిలబస్‌లో ఏడు పరీక్షలుంటాయి. 

Also read: Diwali Rangoli Designs: దీపావళికి మీ ఇంటిని అందంగా అలంకరించుకునే రంగోళి డిజైన్లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News