AP Rajyasabha Elections 2024: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అరుదైన అవకాశాన్ని దక్కించుకుంది. ఖాళీ అయిన మూడు సీట్లను ఏకగ్రీవంగా గెల్చుకోవడం లాంఛనప్రాయం కావడంతో మొత్తం 11 స్థానాల్ని క్లీన్‌స్వీప్ చేసిన తొలిపార్టీగా నిలవనుంది. మరోవైపు 40 ఏళ్ల చరిత్రలో తెలుగుదేశం పార్టీ తొలిసారిగా పెద్దల సభలో ప్రాతినిధ్యం కోల్పోయింది.
రాజ్యసభ ఎన్నికలకు ఇవాళ్టితో నామినేషన్ల గడువు ముగిసింది. ఏపీ, తెలంగాణలోని మూడేసి స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఏపీలోని మూడు స్థానాలకు సంఖ్యాబలం దృష్ట్యా వైసీపీ ముగ్గురిని బరిలో దించింది. వైవి సుబ్బారెడ్డి, మేడా రఘునాథ్ రెడ్డి, గొల్ల బాబూరావులు నామినేషన్లు దాఖలు చేశారు. సంఖ్యాబలం లేకున్నా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అసంతృప్తులపై ఆశలు పెట్టుకుని అభ్యర్ధిని బరిలో దించుదామని అనుకుంది. కానీ అలా చేయాలంటే ఆ పార్టీకు 26 మంది అదనంగా అవసరం. అంతమంది మద్దతు దక్కే అవకాశం లేకపోవడంతో పోటీ నుంచి విరమించుకుంది. దాంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధుల ఎంపిక లాంఛనప్రాయంగా మిగిలింది.
రాజ్యసభలో ఏపీ కోటాలో ఉన్న స్థానాలు 11. ఇప్పుడు మొత్తం 11 స్థానాల్ని ఒకే పార్టీ గెల్చుకోవడం ద్వారా చరిత్ర సృష్టించింది. రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 250 గా అందులో 12 మందిని రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. మిగిలిన 233 మందిని ఆయా రాష్ట్రాల శాసనసభ్యులు ఎన్నుకుంటారు. 2019 ఎన్నికలకు ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకు రాజ్యసభలో ఇద్దరు మాత్రమే ఉండేవారు. తెలుగుదేశం పార్టీకు 9 మంది బలముండేది. అయితే 2019 ఎన్నికల్లో 151 స్థానాలు గెల్చుకున్న వైసీపీ క్రమంగా రాజ్యసభలో స్థానాల సంఖ్య పెంచుకుంది. ఇప్పుడు చివరి మూడు స్థానాలు గెల్చుకోవడం ద్వారా మొత్తం 11 స్థానాల్ని క్లీన్‌స్వీప్ చేసింది.
40 ఏళ్ల చరిత్రలో తెలుగుదేశం పార్టీకు రాజ్యసభలో స్థానం లేకుండా పోయింది. రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ ప్రాతినిధ్యం కోల్పోవడం ఇదే తొలిసారి. తాజాగా రాజ్యసభకు ఎన్నిక కానున్న వైవి సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు, మేడా రఘునాథ్ రెడ్డిల పదవీకాలం 2030 ఏప్రిల్ 1 వరకూ ఉంటుంది. ఇక ఇప్పటికే సభ్యులుగా ఉన్నవారిలో విజయసాయి రెడ్డి, ఆర్ కృష్ణయ్య, నిరంజన్ రెడ్డి, బీద మస్తాన్ రావుల పదవీకాలం 2028 జూన్ 21 వరకూ ఉంది. ఇక ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంంద్రబోస్, పరిమళ నత్వాని పదవీకాలం 2026 జూన్ 21 వరకూ ఉంటుంది. అంటే హీనపక్షం మరో రెండేళ్ల వరకూ రాజ్యసభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకు తిరుగుండదు.
2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా 22 స్థానాలు గెల్చుకుని నాలుగో అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఇప్పుడు రాజ్యసభలో కూడా 11 స్థానాలు గెల్చుకుని నాలుగో అతిపెద్ద పార్టీగా నిలిచింది. అటు తెలంగాణలో కూడా రెండు కాంగ్రెస్ పార్టీ, ఒకటి బీఆర్ఎస్ పార్టీకు ఏకగ్రీవంగా దక్కనున్నాయి.
Also read: AP Bhavan Assets: ఢిల్లీలోని ఏపీ, తెలంగాణ ఆస్థుల పంపిణీలో కీలక పరిణామం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook