Tesla Unit in AP: టెస్లా కోసం చంద్రబాబు ప్రయత్నాలు, ఏపీకు ఉన్న అవకాశాలేంటి

Tesla Unit in AP: దేశంలో ఇప్పుడు అన్ని రాష్ట్రాలు టెస్లా కంపెనీపై దృష్టి సారించాయి. టెస్లా కోసం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రధాని మోదీ పర్యటన తరువాత టెస్లా ఇండియా ఎంట్రీకు మార్గం సుగమం కావడంతో రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 23, 2025, 05:26 PM IST
Tesla Unit in AP: టెస్లా కోసం చంద్రబాబు ప్రయత్నాలు, ఏపీకు ఉన్న అవకాశాలేంటి

Tesla Unit in AP: ప్రముఖ ఈవీ దిగ్గజ కంపెనీ టెస్లా ఇండియా ఎంట్రీకు మార్గం క్లియర్ అయింది. ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన అనంతరం టెస్లా ఇండియా ఎంట్రీపై స్పష్టత వచ్చింది. ముంబై, ఢిల్లీలో షోరూంలు ఏర్పాటు చేసేందుకు సిద్ధమైన టెస్లా అందుకు సంబంధించిన రిక్రూట్‌మెంట్ కూడా ప్రారంభించింది. సాధ్యమైనంత త్వరలో ఇండియాలోనే తయారీ యూనిట్ ఏర్పాటుకు ప్రయత్నిస్తోంది. 

టెస్లాకు ఇండియాలో తయారీ యూనిట్ అవసరం. అప్పుడే భారత మార్కెట్‌కు తగ్గట్టుగా అనువైన ధరలకు ఈవీ కార్లు విక్రయించవచ్చు. అయితే టెస్లా కంపెనీ ఎక్కడ ఏర్పాటు చేస్తుందనేది ఆసక్తిగా ఉంది. అందుకే కొన్ని ప్రధాన రాష్ట్రాలు టెస్లా యూనిట్ కోసం ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాదిలో ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, హర్యానా ఆసక్తి కనబరుస్తుంటే దక్షిణాది నుంచి తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ప్రయత్నిస్తున్నాయి. విభజన అనంతరం అన్ని విధాలుగా నష్టపోయిన ఏపీలో టెస్లా యూనిట్ స్థాపన జరిగితే ఏపీ అభివృద్ధిలో ఇది గేమ్ ఛేంజర్ కానుంది. ఏపీ ముఖ్యమంత్రి టెస్లా యూనిట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. 

ఇప్పటికే పోర్టుకు సమీపంలో భూమి వివరాలతో కంపెనీతో టచ్‌లో వెళ్లారు అధికారులు. వివిధ రకాల ప్రోత్సాహకాలు, అందుబాటులోని పోర్టులు, భూములు, మార్కెట్ వివరాలు అందిస్తున్నారు. గత ఏడాది అక్టోబర్ నెలలో ఏపీ మంత్రి నారా లోకేశ్ అమెరికా పర్యటనలో టెస్లా కంపెనీ ఛీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ వైభవ్ తనేజాను కలిశారు. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానించారు. 207లో గతంలో టెస్లా కంపెనీతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కూడా చేసుకుంది. రాయలసీమలో కంపెనీ కోసం 4 మెగావాట్ల సామర్ధ్యంతో రెండు సౌరశక్తి నిల్వ యూనిట్ల స్థాపనకు టెక్నికల్ సపోర్ట్ ఇస్తామని టెస్లా కంపెనీ అప్పట్లో హామీ ఇచ్చింది. 

ఏపీకు ఉన్న అవకాశాలేంటి

దేశంలో అత్యధికంగా ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు దక్షిణాదిలోనే జరుగుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉండటమే కాకుండా అతిపెద్ద సముద్రతీరం ఉన్న రాష్ట్రం ఇది. గోదావరి, కృష్ణా, పెన్నా నదులతో నీటి వనరులు పుష్కలంగా ఉన్నాయి. విశాఖపట్నం-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ లాభించే అంశంగా ఉంది. చెన్నై నుంచి కోల్‌కతాకు 16వ నెంబర్ జాతీయ రహదారితో పాటు 7 విమానాశ్రయాలు ఉండటం టర్నింగ్ పాయింట్ కావచ్చు. విశాఖ-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కోసం ఇప్పటికే నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో 15 వేల ఎకరాల సేకరణ పూర్తయింది. వీటిలోనే టెస్లాకు భూమి కేటాయించే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది. ముఖ్యంగా శ్రీ సిటీ సమీపంలో టెస్లాకు భూములు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రతిపాదన సిద్ధం చేసినట్టు సమాచారం. శ్రీసిటీకు సమీపంలోనే కృష్ణపట్నం పోర్టు, కొత్తగా అభివృద్ధి చేస్తున్న రామాయపట్నం పోర్టు ఉన్నాయి. 

ఏపీలో రోడ్డు, వాయు, జల రవాణా మూడు కూడా ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఏపీ టెస్లాకు మంచి ఛాయిస్ కావచ్చు. అదే జరిగితే ఇక ఏపీకు తిరుగు ఉండదు. 

Also read: Jio New Plan: 195 రూపాయలకే 3 నెలల వ్యాలిడిటీతో జియో హాట్‌స్టార్ ఉచితం

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News