ఆ కాలేజీలో ఒకే టీచర్.. ఒకే విద్యార్థి

ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాకి చెందిన మహారాజా ప్రభుత్వ సంస్కృత కళాశాల వైనం ఇది.

Last Updated : Dec 30, 2017, 01:34 PM IST
ఆ కాలేజీలో ఒకే టీచర్.. ఒకే విద్యార్థి

ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాకి చెందిన మహారాజా ప్రభుత్వ సంస్కృత కళాశాల వైనం ఇది. తరతరాలుగా ఈ కళాశాలలో సంస్కృతాన్ని బోధిస్తూ.. ఎందరో మేటి పండితులను తయారుచేసిన ఈ విద్యాసంస్థ నేడు విద్యార్థులు లేక మూగబోతోంది. అయినప్పటికి ఒక సంప్రదాయ పరిరక్షణలో భాగంగా ఈ కళాశాల  కొనసాగాల్సిందేనని... ఆసక్తి ఉంటే విద్యార్థులు తప్పక వచ్చి ఈ కళాశాలలో చేరుతారని యాజమాన్యం తెలపడం గమనార్హం. ప్రస్తుతం ఈ పాఠశాలలో ఒకే  అధ్యాపకురాలు ఉండగా.. ఒకే విద్యార్థిని విద్యను అభ్యసించడం విశేషం.

1860లో విజయనగరంలో గజపతి రాజులు నిర్మించిన ఈ కళాశాల నిర్వహణా బాధ్యతలను 1957లో ప్రభుత్వం తీసుకుంది. ఈ మధ్యకాలంలో సంస్కృతాన్ని నేర్చుకొనే విద్యార్థులు పూర్తిగా తగ్గిపోవడంతో.. కళాశాలకు కూడా ఆదరణ తగ్గింది. అయితే విద్యార్థులున్నా, లేకున్నా ఈ కళాశాల కొనసాగుతుందని.. సంస్కృతాన్ని నేర్చుకోవాలనుకునే భావితర విద్యార్థులకు ఈ కళాశాల తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని కళాశాల యాజమాన్యం ఆశాభావం వ్యక్తం చేసింది

Trending News