Hyderabad మహిళా టెకీ ఆత్మహత్య

ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారని మహిళా టెకీ ఆత్మహత్య (Techie Commits Suicide) చేసుకుంది. వరుడిని వెతికేందుకు వెళ్లి తిరిగి రాగా కుటుంబసభ్యులకు విషాదం కనిపించింది.

Last Updated : Aug 6, 2020, 06:03 PM IST
  • హైదరాబాద్‌లో మహిళా టెకీ ఆత్మహత్య
  • వరుడిని కలిసేందుకు వెళ్లిన కుటుంబం
  • ఒంటరిగా ఉన్న యువతి ఫ్యాన్‌కు ఉరేసుకుంది
  • ఇంటికి తిరిగొచ్చి షాక్ తిన్న కుటుంబసభ్యులు
  • కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు
Hyderabad మహిళా టెకీ ఆత్మహత్య

హైదరాబాద్:  ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారని, ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదంటూ మహిళా టెకీ ఆత్మహత్య (Woman Techie Suicide) చేసుకుంది. తనకు సంబంధాలు చూడవద్దని చెప్పినా ఇంట్లో వరుడిని వెతికి పని ప్రారంభించడంతో మనస్తాపానికి గురైన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ బలవన్మరణం (Techie Suicide) చెందింది. నగరంలోని ఎల్బీనగర్ మన్సురాబాద్‌లో బుధవారం రాత్రి ఈ విషాదం చోటుచేసుకుంది.  కోవిడ్19 ఇన్ఫెక్షన్లు 6 రకాలు.. ఆ దశలో ప్రాణాలకే ముప్పు

పోలీసుల కథనం ప్రకారం.. లక్ష్మీ(27) మదాపూర్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. తల్లి లింగమ్మ, పెద్దన్న క్రిష్ణతో కలిసి ఎల్బీ నగర్, మన్సూరాబాద్ ఏరియాలో నివాసం ఉంటోంది. లక్ష్మీకి వివాహం చేయాలని కుటుంబం భావించింది. అయితే తనకు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని టెకీ తన కుటుంబసభ్యులకు చెప్పింది. ‘ఇస్మార్ట్’ బ్యూటీ నభా నటేష్ హాట్ హాట్‌గా..

ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం వరుడిని చూసేందుకు లక్ష్మీ సోదరుడు తల్లి వెళ్లారు. ఆ సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న లక్ష్మి ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇంటికి వచ్చి చూసేసరికి లక్ష్మీ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించగా కుటుంబసభ్యులు షాకయ్యారు. ఇప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేకపోవడంతో మహిళా టెకీ ఆత్మహత్య చేసుకుందని ఎల్బీనగర్ పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. Photos: పెళ్లికి ముందే గర్భం దాల్చిన నటీమణులు వీరే... 
 సాహో డైరెక్టర్ Sujeeth Wedding Photos 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x