Kavitha CBI Letter: ఢిల్లీ మద్యం కుంభకోణంలో గతంలో సాక్షిగా ఉన్న తాజాగా నిందితురాలిగా చేరుస్తూ నోటీసులు ఇవ్వడంపై బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈనెల 26వ తేదీన విచారణకు రాలేనని స్పష్టం చేశారు. ముందస్తు కార్యక్రమాల నేపథ్యంలో విచారణకు హాజరుకాలేనని వివరించారు. ఈ సందర్భంగా నోటీసుల విషయమై కీలక అంశాన్ని ప్రస్తావించారు. 'గతంలో సెక్షన్ 160 నోటీసులకు, 41ఏ నోటీసు పూర్తి విరుద్ధంగా ఉంది. సెక్షన్ 41ఏ కింద ఏ పరిస్థితుల్లో నోటీసులు ఇచ్చారో స్పష్టత కొరవడింది. ఎన్నికల సమయంలో నోటీసులు ఇవ్వడం అనేక ప్రశ్నలకు తావిస్తోంది' అని సందేహాం వ్యక్తం చేశారు.
Also Read: Telangana: ముఖ్యమంత్రి అవుతాడని రేవంత్ రెడ్డి స్వగ్రామంలోనే ఎవరూ నమ్మలేదు: కేటీఆర్
'నా ప్రజాస్వామిక, రాజ్యాంగ హక్కులకు భంగం కలిగిస్తోంది. మీ ఆరోపణల్లో నా పాత్ర లేదు. దీనికితోడు ఈ కేసు కోర్టులో పెండింగ్‌లో ఉంది. ఈడీ నోటీసులపై నేను సుప్రీంకోర్టును ఆశ్రయించా. ప్రస్తుతం ఆ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్ ఉండడంతో నన్ను విచారణకు పిలవబోమని అదనపు సొలిసిటర్ జనరల్ చెప్పారు' అని లేఖలో కవిత గుర్తుచేశారు. 'సుప్రీంకోర్టులో హామీ సీబీఐకి కూడా వర్తిస్తుంది. సీబీఐ బృందం నా ఇంటికి వచ్చినప్పుడు విచారణకు సహకరించా. సీబీఐ దర్యాప్తునకు ఎప్పుడైనా సహకరిస్తా' అని స్పష్టం చేశారు.
Also Read: VIPs Drivers: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ప్రముఖుల డ్రైవర్లకు 'ఫిట్నెస్ టెస్టులు'
తాజాగా నోటీసులు ఇవ్వడంపై లేఖలో కవిత పలు సందేహాలు లేవనెత్తారు. '15 నెలల విరామం తర్వాత ఇప్పుడు విచారణకు పిలవడం.. సెక్షన్లు మార్చడం వంటివి అనేక అనుమానాలకు తావిస్తోంది. పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా మా పార్టీ కొన్ని బాధ్యతలు అప్పగించింది. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం, సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. వచ్చే 6 వారాల పాటు పారట్ఈ సమావేశాల్లో పాల్గొనాల్సి ఉంది. నా పర్యటనల నేపథ్యంలో ఫిబ్రవరి 26వ తేదీన విచారణకు హాజరుకాలేను' అని కవిత లేఖలో తెలిపారు. ఇక విచారణకు వర్చువల్‌గా అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసును సీబీఐ త్వరగా ముగించాలని చూస్తోంది. ఈ క్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు వరుసగా నోటీసులు ఇస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయనతోపాటు కవితను కూడా అరెస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. పార్లమెంట్ ఎన్నికల సమయంలో విపక్షాలను కేంద్ర ప్రభుత్వం అదుపులోకి తీసుకునేందుకు ఈ చర్యకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే కేజ్రీవాల్‌కు, కవితకు నోటీసులు వచ్చాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీబీఐకి రాసిన లేఖలో కూడా కవిత ఇవే సందేహాలను లేవనెత్తారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి