IND vs WI 1st ODI LIVE*: రోహిత్ మెరుపులు.. సూర్య క్లాస్ ఇనింగ్స్! తొలి టీ20లో భారత్ ఘన విజయం!!

మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా కోల్‌కతా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. విండీస్ నిర్ధేశించిన 158 పరుగుల లక్ష్యాన్ని భారత్ 18.5 ఓవర్లలో 162 రన్స్ చేసి జయకేతనం ఎగురవేసింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 16, 2022, 11:00 PM IST
  • India vs West Indies 1st T20 Live: Rohit Sharma, Suryakumar, Iyer help IND beat WI in 1st T20I. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా కోల్‌కతా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. విండీస్ నిర్ధేశించిన 158 పరుగుల లక్ష్యాన్ని భారత్ 18.5 ఓవర్లలో 162 రన్స్ చేసి జయకేతనం ఎగురవేసింది. 
IND vs WI 1st ODI LIVE*: రోహిత్ మెరుపులు.. సూర్య క్లాస్ ఇనింగ్స్! తొలి టీ20లో భారత్ ఘన విజయం!!
Live Blog

IND vs WI 1st ODI LIVE: మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా కోల్‌కతా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. విండీస్ నిర్ధేశించిన 158 పరుగుల లక్ష్యాన్ని భారత్ 18.5 ఓవర్లలో 162 రన్స్ చేసి జయకేతనం ఎగురవేసింది. 

16 February, 2022

  • 22:54 PM

    తొలి టీ20లో భారత్ ఘన విజయం:

    మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా కోల్‌కతా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. విండీస్ నిర్ధేశించిన 158 పరుగుల లక్ష్యాన్ని భారత్ 18.5 ఓవర్లలో 162 రన్స్ చేసి జయకేతనం ఎగురవేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (40; 19 బంతుల్లో 4x4, 3x6) మెరుపు ఆరంభం ఇవ్వగా.. సూర్యకుమార్ యాదవ్  (34; 18 బంతుల్లో 5x4, 1x6) క్లాస్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇషాన్ కిషన్ (35), వెంకటేష్ అయ్యర్ (24) పరుగులు చేశారు. విండీస్ బౌలర్ రోస్టన్ ఛేజ్ రెండు వికెట్లు పడగొట్టాడు. 

  • 22:45 PM

    వెంకీ ఫోర్.. విజయానికి చేరువగా భారత్:
    18వ ఓవర్ చివరి బంతికి వెంకటేష్ అయ్యర్ ఫోర్ బాదాడు. దాంతో టీమిండియా విజయానికి చేరువైంది. 18 ఓవర్లకు భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. సూర్య (28), వెంకీ (17) క్రీజులో ఉన్నారు. భారత్ విజయానికి ఇంకా 12 బంతుల్లో 9 పరుగులు చేయాలి. 

  • 22:40 PM

    సిక్స్, ఫోర్ బాదిన సూర్య :
    17వ్ అవర్లో సూర్యకుమార్ యాదవ్ సిక్స్, ఫోర్ బాదాడు. దాంతో టీమిండియాపై ఒత్తిడి తగ్గింది. 17 ఓవర్లకు భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసింది. సూర్య (26), వెంకీ (9) క్రీజులో ఉన్నారు. భారత్ విజయానికి ఇంకా 18 బంతుల్లో 19 పరుగులు చేయాలి. 

  • 22:36 PM

    నాలుగు పరుగులే ఇచ్చిన షెపర్డ్:
    రొమారియో షెపర్డ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 16 ఓవర్ వేసిన రొమారియో షెపర్డ్ కేవలం నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చాడు. దాంతో టీమిండియాపై ఒత్తిడి పెరిగింది. 16 ఓవర్లకు భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసింది. సూర్య (15), వెంకీ (7) క్రీజులో ఉన్నారు. భారత్ విజయానికి ఇంకా 24 బంతుల్లో 32 పరుగులు చేయాలి. 

  • 22:28 PM

    నాలుగో వికెట్ కోల్పోయిన భారత్:
    భారత్ కీలక నాలుగో వికెట్ కోల్పోయింది. షెల్డ్రన్ కాట్రేల్ వేసిన ఛేజ్ వేసిన 15వ ఓవర్ మూడో బంతికి రిషబ్ పంత్ (8) ఔట్ అయ్యాడు. 15 ఓవర్లకు భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది. సూర్య (13), వెంకీ (5) క్రీజులో ఉన్నారు. 

  • 22:23 PM

    14 ఓవర్లకు భారత్ స్కోర్ 112/3:
    14 ఓవర్లలో భారత్ మూడు వికెట్ల నష్టానికి 112 రన్స్ చేసింది. క్రీజులో సూర్యకుమార్ యాదవ్ (12), రిషబ్ పంత్ (6) ఉన్నారు. భారత్ విజయానికి ఇంకా 36 బంతుల్లో 46 పరుగులు చేయాలి. 

  • 22:16 PM

    బ్యాక్ టు బ్యాక్ వికెట్లు:
    భారత్ వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. రోస్టన్ ఛేజ్ వేసిన 12వ ఓవర్ చివరి బంతికి ఓపెనర్ ఇషాన్ కిషన్ (35) ఔట్ కాగా.. ఫ్యాబియాన్ అలెన్ వేసిన 13వ్ ఓవర్ రెండో బంతికి విరాట్ కోహ్లీ పెవిలియన్ చేరాడు. కోహ్లీ 13 బంతుల్లో 17 రన్స్ చేశాడు. 13 ఓవర్లకు భారత్ మూడు వికెట్లు కోల్పోయి 103 పరుగులు చేసింది. సూర్య, పంత్ క్రీజులో ఉన్నారు. 

  • 22:11 PM

    రెండో వికెట్ కోల్పోయిన భారత్.. ఇషాన్ కిషన్ గాన్!!
    భారత్ రెండో వికెట్ కోల్పోయింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ (35) ఔట్ అయ్యాడు. రోస్టన్ ఛేజ్ వేసిన 12వ ఓవర్ చివరి బంతికి ఔట్ అయ్యాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి కాస్త తడబడిన ఇషాన్.. 42 బంతుల్లో 35 పరుగులు చేశాడు. 

  • 22:05 PM

    11 ఓవర్లలో భారత్ స్కోర్ 89/1:
    11 ఓవర్లలో భారత్ ఒక వికెట్ కోల్పోయి 89 రన్స్ చేసింది. విరాట్ కోహ్లీ ఈ ఓవర్లో ఓ బౌండరీ బాదాడు. క్రీజులో ఇషాన్ కిషన్ (33), విరాట్ కోహ్లీ (14) ఉన్నారు. 

  • 21:53 PM

    మొదటి వికెట్ కోల్పోయిన భారత్:
    158 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ మొదటి వికెట్ కోల్పోయింది. రోస్టన్ ఛేజ్ వేసిన 8వ్ ఓవర్ మూడో బంతికి ఓపెనర్ రోహిత్ శర్మ (40) భారీ షాట్ ఆడి బౌండరీ వద్ద క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 8ఓవర్లు ముగిసేసరికి భారత్ ఒక వికెట్ కోల్పోయి 65 పరుగులు చేసింది. క్రీజులో ఇషాన్ కిషన్ (23), విరాట్ కోహ్లీ (1) ఉన్నారు. 

  • 21:48 PM

    ఓపెనర్లను కట్టడి చేసిన స్పిన్నర్లు.. 7వ ఓవర్లలో ఐదు పరుగులే:
    బౌండరీలతో రెచ్చిపోతున్న భారత ఓపెనర్లను రోహిత్ శర్మ (40), ఇషాన్ కిషన్ (22)లను విండీస్ స్పిన్నర్లు కట్టడి చేయారు. 6వ ఓవర్లో రోస్టన్ ఛేజ్ ఒక పరుగు ఇవ్వగా.. 7వ ఓవర్లో అకేల్ హోసేన్ ఐదు పరుగులు ఇచ్చాడు. 

  • 21:40 PM

    పవర్ ప్లే ముగిసేసరికి భారత్ స్కోర్ 58/0: 
    పవర్ ప్లే ముగిసేసరికి భారత్ ఒక్క వికెట్ కోల్పోకుండా 58 రన్స్ చేసింది. ఆరో ఓవర్ వేసిన రోస్టన్ ఛేజ్ భారత ఓపెనర్లను కట్టడి చేశాడు. ఇషాన్ కిషన్ ఐదు బంతులు ఆడి ఒక పరుగు మాత్రమే చేశాడు. 

  • 21:37 PM

    5 ఓవర్లకు భారత్ స్కోర్ 57/0: 
    ఐదు ఓవర్లు ముగిసేసరికి భారత్ ఒక్క వికెట్ కోల్పోకుండా 57 రన్స్ చేసింది. ఈ ఓవర్లో ఇషాన్ కిషన్ రెండు ఫోర్లు బాధగా.. రోహిత్ శర్మ ప్  బౌండరీ కొట్టాడు. రోహిత్ (38), ఇషాన్ (18) పరుగులతో క్రీజులో ఉన్నారు. 

  • 21:32 PM

    4 ఓవర్లకు భారత్ స్కోర్ 44/0: 
    నాలుగు ఓవర్లు ముగిసేసరికి భారత్ వికెట్ కోల్పోకుండా 44 పరుగులు చేసింది. ఈ ఓవర్లో రోహిత్ బౌండరీల మోత మోగించాడు. ఓడియన్ స్మిత్ వేసిన నాలుగో ఓవర్లో రెండు సిక్సులు, రెండో ఫోర్లు బాదాడు. రోహిత్ శర్మ (34), ఇషాన్ కిషన్ (9) పరుగులతో క్రీజులో ఉన్నారు. 

  • 21:21 PM

    2 ఓవర్లకు భారత్ స్కోర్ 11/0: 
    రెండు ఓవర్లు ముగిసేసరికి భారత్ వికెట్ కోల్పోకుండా.. 11 పరుగులు చేసింది. రెండో ఓవర్ చివరి బంతికి రోహిత్ భారీ సిక్స్ బాదాడు. రోహిత్ శర్మ (8), ఇషాన్ కిషన్ (3) పరుగులతో క్రీజులో ఉన్నారు. 

  • 21:17 PM

    మొదటి ఓవర్లో 3 పరుగులు చేసిన భారత్: 
    మొదటి ఓవర్లో భారత్ మూడు పరుగులు చేసింది. రోహిత్ శర్మ (1), ఇషాన్ కిషన్ (2) పరుగులతో క్రీజులో ఉన్నారు. 

  • 21:12 PM

    ప్రారంభం అయిన టీమిండియా ఇన్నింగ్స్. ఓపెనర్లుగా బరిలోకి దిగిన రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్. 

  • 20:59 PM

    ముగిసిన విండీస్ ఇన్నింగ్స్.. 20 ఓవర్లలో స్కోర్ 157/7!!
    మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా కోల్‌కతా వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టీ20లో విండీస్ పోరాడే స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 157 రన్స్ చేసి.. టీమిండియా ముందు 158 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. నికోలస్ పూరన్ ఐదు సిక్సులతో చెలరేగాడు. భారత బౌలర్లు రవి బిష్ణోయ్, హర్షల్ పటేల్ తలో రెండు వికెట్లు పడగొట్టాడు. 
     

  • 20:54 PM

    19 ఓవ‌ర్ల‌కు విండీస్ స్కోర్‌ 147/6
    19 ఓవర్లు ముగిసేస‌రికి విండీస్ ఆరు వికెట్ల న‌ష్టానికి 147 రన్స్ చేసింది. క్రీజులో కీరన్ పోలార్డ్ (18), ఓడియన్ స్మిత్ (1) ప‌రుగుల‌తో ఉన్నారు.
     

  • 20:49 PM

    హమ్మయ్య.. డెంజరస్ మ్యాన్ పూరన్ ఔట్!
    విండీస్ డెంజరస్ బ్యాటర్ నికోలస్ పూర‌న్‌ ఔట్ అయ్యాడు. హర్షల్ పటేల్ వేసిన 18వ ఓవర్ చివరి భారీ షాట్ ఆడిన పూర‌న్‌.. బౌండరీ వద్ద కోహ్లీకి చిక్కాడు. పూర‌న్‌ 43 బంతుల్లో 61 రన్స్ చేశాడు. 

  • 20:41 PM

    పూరన్ హాఫ్ సెంచరీ:
    విండీస్ స్టార్ బ్యాటర్ నికోలస్ పూర‌న్‌ హాఫ్ సెంచరీ చేశాడు. చహల్ వేసిన 17వ ఓవర్ మొదటి బంతికి సిక్స్ బాదిన పూర‌న్‌.. 50 మార్క్ అందుకున్నాడు. 

  • 20:36 PM

    రవి బిష్ణోయ్ సూపర్.. మొదటి మ్యాచులోనే అదరగొట్టాడుగా:
    యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్.. తన మొదటి అంతర్జాతీయ మ్యాచులోనే అదరగొట్టాడు. తన కోటా నాలుగు ఓవర్లలో 17 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. అయితే 6 వైడ్స్ వేసి అదనపు పరుగులు ఇచ్చాడు. 

  • 20:28 PM

    15 ఓవ‌ర్ల‌కు విండీస్ స్కోర్‌: 96/5
    15 ఓవర్లు ముగిసేస‌రికి విండీస్ ఐదు వికెట్ల న‌ష్టానికి 96 రన్స్ చేసింది. క్రీజులో నికోలస్ పూర‌న్‌ (37), కీరన్ పోలార్డ్ (1) ప‌రుగుల‌తో ఉన్నారు.
     

  • 20:25 PM

    ఐదవ వికెట్ కోల్పోయిన వెస్టిండీస్:
    వెస్టిండీస్ ఐదవ వికెట్ కోల్పోయింది. దీపక్ చహర్ వేసిన 13వ ఓవర్ ఐదవ బంతికి అకేల్ హోసేన్ (10) ఔట్ అయ్యాడు. హోసేన్ భారీ షాట్ ఆడగా.. బౌలర్ చహరే క్యాచ్ పట్టాడు. 14 ఓవర్లు ముగిసేసరికి పోలార్డ్ సేన ఐదు వికెట్ల నష్టానికి 94 పరుగులు చేసింది. 

  • 20:16 PM

    12 ఓవ‌ర్ల‌కు విండీస్ స్కోర్‌: 81/4
    12 ఓవర్లు ముగిసేస‌రికి విండీస్ నాలుగు వికెట్ల న‌ష్టానికి 81 రన్స్ చేసింది. క్రీజులో నికోలస్ పూర‌న్‌ (30), అకేల్ హోసేన్ (3) ప‌రుగుల‌తో ఉన్నారు.

  • 20:10 PM

    రవి బిష్ణోయ్ ఖాతాలో మొదటి అంతర్జాతీయ వికెట్:
    టీమిండియా యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్ మొదటి అంతర్జాతీయ వికెట్ ఖాతాలో వేసుకున్నాడు. 11వ ఓవర్ రెండో బంతికి రోస్టన్ ఛేజ్‌ (4)ను ఔట్ చేయడంతో రవి ఖాతాలో తొలి వికెట్ చేరింది. అదే ఓవర్లో రోవ్మాన్ పావెల్ (2) కూడా అతడు పెవిలియన్ చేర్చాడు. విండీస్ 11 ఓవర్లు ముగిసేసరికి నాలుగు వికెట్లు కోల్పోయి 75 రన్స్ చేసింది. క్రీజులో నికోలస్ పూర‌న్‌ (28), అకేల్ హోసేన్ (0) ప‌రుగుల‌తో ఉన్నారు.

  • 19:57 PM

    10 ఓవ‌ర్ల‌కు విండీస్ స్కోర్‌: 71/2
    పది ఓవర్లు ముగిసేస‌రికి విండీస్ రెండు వికెట్ల న‌ష్టానికి 71 రన్స్ చేసింది. క్రీజులో నికోలస్ పూర‌న్‌ (27), రోస్టన్ ఛేజ్ (4) ప‌రుగుల‌తో ఉన్నారు. ఈ ఓవర్లో పూరన్ ఓ ఫోర్ బాదాడు. 

  • 19:51 PM

    9 ఓవ‌ర్ల‌కు విండీస్ స్కోర్‌: 63/2
    తొమ్మిది ఓవర్లు ముగిసేస‌రికి రెండు వికెట్ల న‌ష్టానికి విండీస్ 63 ప‌రుగులు చేసింది. క్రీజులో నికోలస్ పూర‌న్‌ (23), రోస్టన్ ఛేజ్ (1) ప‌రుగుల‌తో ఉన్నారు. ఈ ఓవర్లో భారత్ ఒక రివ్యూ కోల్పోయింది. చహల్ వేసిన చివరి బంతికి పూరన్ భారీ సిక్స్ బాదాడు. 

  • 19:47 PM

    8 ఓవ‌ర్ల‌కు విండీస్ స్కోర్‌: 55/2
    8 ఓవర్లు ముగిసేస‌రికి రెండు వికెట్ల న‌ష్టానికి విండీస్ 55 ప‌రుగులు చేసింది. క్రీజులో నికోలస్ పూర‌న్‌ (16), రోస్టన్ ఛేజ్ (0) ప‌రుగుల‌తో ఉన్నారు. ఈ ఓవర్లో భారత్ ఒక రివ్యూ కోల్పోయింది. 
     

  • 19:38 PM

    రెండో వికెట్ కోల్పోయిన విండీస్.. మైయ‌ర్స్‌ ఔట్!!
    వెస్టిండీస్ రెండో వికెట్ కోల్పోయింది. దూకుడుమీదున్న ఓపెనర్ కైల్ మైయ‌ర్స్‌ (31) ఔట్ అయ్యాడు. యుజ్వేంద్ర చహల్ వేసిన 7వ ఓవర్ ఐదవ బంతికి మైయ‌ర్స్‌ ఎల్బీగా వెనుదిరిగాడు. రివ్యూకి వెళ్లినా.. ఫలితం లేకుండా పోయింది. 

  • 19:32 PM

    పవర్ ప్లే ముగిసేసరికి విండీస్ స్కోర్‌: 44/1
    పవర్ ప్లే ముగిసేస‌రికి వికెట్ న‌ష్టానికి విండీస్ 44 ప‌రుగులు చేసింది. క్రీజులో కైల్ మైయ‌ర్స్‌ (31), నికోలస్ పూర‌న్‌ (8) ప‌రుగుల‌తో ఉన్నారు.
     

  • 19:27 PM

    5 ఓవ‌ర్ల‌కు విండీస్ స్కోర్‌: 35/1
    ఐదు ఓవర్లు ముగిసేస‌రికి వికెట్ న‌ష్టానికి విండీస్ 35 ప‌రుగులు చేసింది. క్రీజులో కైల్ మైయ‌ర్స్‌ (23), నికోలస్ పూర‌న్‌ (8) ప‌రుగుల‌తో ఉన్నారు.

  • 19:22 PM

    నాలుగో ఓవర్ ముగిసేసరికి వెస్టిండీస్ 25 పరుగులు చేసింది. ఈ ఓవర్ ఐదవ బంతికి నికోలస్ పురన్ సిక్స్ బాదాడు. 

  • 19:14 PM

    రెండు ఓవర్లు పూర్తయ్యేసరికి విండీస్ ఒక వికెట్ కోల్పోయి 12 పరుగులు చేసింది. దీపక్ చహర్ వేసిన రెండో ఓవర్లో 8 పరుగులు వచ్చాయి. 

  • 19:07 PM

    మొదటి వికెట్ కోల్పోయిన విండీస్.. బ్రాండన్ కింగ్ ఔట్!!
    భువనేశ్వర్ కుమార్ వేసిన తొలి ఓవర్ ఐదవ బంతికి విండీస్ ఓపెనర్ బ్రాండన్ కింగ్ (4) ఔట్ అయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ అద్భుత క్యాచ్ అందుకున్నాడు. 

  • 18:52 PM

    టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. 

    తుది జట్లు:
    భారత్:
    ఇషాన్‌ కిషన్‌, రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), విరాట్‌ కోహ్లి, సూర్యకుమార్‌ యాదవ్‌, రిషభ్‌ పంత్‌(వికెట్‌ కీపర్‌), వెంకటేశ్‌ అయ్యర్‌, దీపక్‌ చహర్‌, భువనేశ్వర్‌ కుమార్‌, హర్షల్‌ పటేల్‌, రవి బి‍ష్ణోయ్‌‌, యజువేంద్ర చహల్‌.

    వెస్టిండీస్
    బ్రాండన్‌ కింగ్‌, కైల్ మేయెర్స్‌, నికోలస్‌ పూరన్‌ (వికెట్‌ కీపర్‌), పావెల్‌, కీరన్‌ పొలార్డ్‌(కెప్టెన్‌), రోస్టన్ చేజ్‌,  రొమారియో షెపర్డ్‌, ఓడియన్‌ స్మిత్, అకీల్‌ హొసేన్‌, షెల్డన్‌ కాట్రెల్‌, ఫాబియన్ ఆలెన్.

Trending News