Business Plan: మహిళా సంఘంలో లోన్ తీసుకుని పాడి గేదెలు కొనుగోలు చేసి నెలకు లక్షా 20వేలు సంపాదిస్తున్న మహిళ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మహిళా సంఘాలకు బ్యాంకు రుణాల ద్వారా ప్రతి ఏడాది లక్ష్యం ఉంటుంది. మహిళల ఆర్థిక అభివ్రుద్ధి కోసం వారిని ప్రోత్సహించేందుకు అందిస్తున్నారు.
Business Plan: మహిళా సంఘంలో లోన్ తీసుకుని పాడి గేదెలు కొనుగోలు చేసి నెలకు లక్షా 20వేలు సంపాదిస్తున్న మహిళ ఇప్పుడు అందరికీ అదర్శంగా నిలుస్తున్నారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తే కచ్చితంగా విజయం సాధించవచ్చని నిరూపించింది మహిళ. మహిళా సంఘం డ్వాక్రా గ్రూప్ ద్వారా బ్యాంకులో లోన్ తీసుకుంది. ఆ లోన్ తో పాడి గేదెలను కొనుగోలు చేసింది. పాడి గేదెల నుంచి పాల ఉత్పత్తిని పెంచుకుని నెలకు లక్షా 20వేలు సంపాదిస్తోంది.
నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం గాంధీనగర్ గ్రామానికి చెందిన అనిత, జైపాల్ రెడ్డి ఇద్దరు దంపతులు. అనిత డ్వాక్రా మహిళల గ్రూప్ సభ్యురాలు. అయితే బ్యాంక్ ద్వారా లోన్ తీసుకుని 9 పాడి గేదెలను కొనుగోలు చేశారు. అందులో రెండ సూడి గేదెలు కూడా ఉన్నాయి. మరో 7 గేదెలు పొద్దున 25లీటర్లు, సాయంత్రం 25లీటర్ల పాలు ఇస్తున్నాయి. లీటర్ పాలు 80 రూపాయలకు విక్రయిస్తున్నారు. గేదెల పోషణ వారే చూసుకుంటున్నారు.
పశువులకు కావాల్సిన గడ్డిని కూడా వారి పొలం నుంచి తీసుకువస్తారు. నెలకు లక్షా 20వేల రూపాయల ఆదాయం పొందుతున్నారు. డ్వాక్రా గ్రూప్ లో లోన్ తీసుకుని మొత్తం 9 గేదెలు కొనుగోలు చేశామని చెబుతోంది. అందులో 2 చూడి గేదెలు, 7 పాలిచ్చే గేదెలు ఉన్నాయి. రోజు 25లీటర్లు పొద్దున, 25లీటర్లు సాయంత్రం పాలు ఇస్తున్నాయి. లీటర్ పాలు 80 రూపాయలకు మార్కెట్లో విక్రయిస్తున్నట్లు చెబుతున్నారు.
తన భర్త గేదెల పోషణ చేస్తూ జీవనం సాగిస్తున్నారు. 40 రూపాయలు ఖర్చు పోయినా 40 రూపాయల లాభం వస్తుందని చెబుతున్నారు. మహిళా సంఘం నుంచి గేదెల కోసంలోన్ తీసుకున్నట్లు చెప్పారు. ప్రతినెల టైంకు బ్యాంకు లోన్ చెల్లిస్తున్నట్లు అనిత వివరించారు.
మహిళా సంఘాలకు బ్యాంకు లోన్స్ ద్వారా ప్రతి ఏడాది ఓ లక్ష్యం ఉంటుందని అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ భూమేష్ గౌడ్ తెలిపారు. మహిళల ఆర్థిక అభివ్రుద్ధి కోసం వారిని ప్రోత్సహించేందుకు అందిస్తున్నామని తెలిపారు.
ముఖ్యంగా మహిళలు పాడి పరిశ్రమలో ముందుకు వెళ్లాలని ఉద్దేశంతో వారికి ప్రత్యేకంగా లోన్స్ ఇస్తున్నట్లు తెలిపారు. మహిళా సంఘాల సభ్యులు పాడి గేదెలను కొనుగోలు చేసి పాల ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు. ఒక్కొక్క సభ్యులు రెండు లక్షల చొప్పున లోన్స్ తీసుకున్నట్లు తెలిపారు.