Best Weight Loss Diet: బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజు ఈ డైట్‌ను పాటించడం వల్ల సులభంగా బరువు తగ్గుతారు. ఏయే ఆహారాలు శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించి, బరువును తగ్గిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Best Weight Loss Diet: బరువు తగ్గడానికి మార్కెట్లో చాలా రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి. వీటిని వినియోగించడం వల్ల భవిష్యత్‌లో తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇంటి చిట్కాలను ప్రతి రోజూ పాటించడం వల్ల సులభంగా బరువు తగ్గొచ్చు. అంతేకాకుండా రోజు వారి డైట్లో పలు ఆహారాలు చేర్చుకుంటే సహజంగా సులభంగా బరువు తగ్గొచ్చు. ఎలాంటి ఆహారాలను తీసుకుంటే సులభంగా బరువు తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రతి రోజు వాకింగ్ చేయడం వల్ల కూడా శరీర ఫిట్‌గా మారి.. బరువు తగ్గుతారు. కాబట్టి అధిక బరువు సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా ప్రతి రోజు 10 నుంచి 20 నిమిషాల పాటు వాకింగ్ చేయాల్సి ఉంటుంది..
సలాడ్స్ కూడా శరీర బరువును నియంత్రిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మొలకెత్తిన పప్పులను తీసుకుని సలాడ్స్లా చేసుకుని డైట్లో తీసుకోవడం వల్ల సులభంగా శరీర బరువు తగ్గుతారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి.
ఇడ్లీ సాంబార్ కూడా శరీర బరువును నియంత్రిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి అల్పాహారంలో ప్రతి రోజు ఇడ్లీ సాంబార్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఫైబర్ కూడా అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి శరీరం దృఢంగా తయారవుతుంది.
ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉండే పప్పులను కూడా ఆహారాల్లో తీసుకోవాల్సి ఉంటుంది. అన్ని రకాల పప్పులను తీసుకుని ఒక రోజు ముందే నీటిలో నానబెట్టుకుని అట్టు, దోసెలా వేసుకుని తినడం వల్ల సులభంగా బరువు తగ్గుతారు. అంతేకాకుండా శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణాలు కూడా తగ్గుతాయి.
లీచీ పండ్లలో ఫైబర్ అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి ఈ పండ్లతో తయారు చేసిన రసాన్ని ప్రతి రోజు ఖాళీ కడుపుతో తాగడం వల్ల సులభంగా శరీర బరువు నియంత్రించవచ్చు. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. (నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)