Non Veg Market: రేపు వైన్స్‌, మాంసం దుకాణాలు బంద్‌.. పెత్తరామసకు ముక్క, సుక్క లేనట్టే!

Dry Day Tommorrow In Pitru Amavasya And Gandhi Jayanthi: పితృమాసంలో వచ్చే అమావాస్య హిందూవులకు చాలా ముఖ్యం. గతించిన వారికి పూజలు చేసే రోజు పెద్ద కష్టమొచ్చి పడింది. గాంధీ జయంతి, పెత్తరామాస రెండూ ఒకే రోజు రావడంతో పెద్ద చిక్కు వచ్చింది. గాంధీ జయంతి సందర్భంగా వైన్స్‌, మాంసం దుకాణాలు మూత పడడంతో ఈసారి ముక్క, సుక్క లేకుండానే పెద్దరామాస ముగించాల్సి వచ్చింది.

1 /8

గాంధీ జయంతి: భారత జాతిపిత మహాత్మాగాంధీ జయంతి అక్టోబర్‌ 2వ తేదీ. ప్రతి యేటా గాంధీ జయంతిని ఘనంగా చేసుకుంటాం.

2 /8

పితృ అమావాస్య: అయితే గాంధీ జయంతి రోజే హిందూవులకు ముఖ్యమైన పెత్తరామాస (పెద్దల అమావాస్య) వచ్చింది. కుటుంబంలో మరణించిన వారికి ఈరోజు పూజలు చేస్తారు. వారికి ఇష్టమైన పదార్థాలు వండి పెడతారు.

3 /8

రెండూ ఒకేసారి: పెత్తర అమావాస్య రోజు కోడి మాంసం, యాట మాంసం, మద్యం కూడా పెద్దలకు పెడుతుంటారు. అయితే గాంధీ జయంతి కారణంగా పెద్ద చిక్కు వచ్చింది.

4 /8

దుకాణాలు మూత: గాంధీ జయంతి రోజు ప్రతి మాంసం దుకాణంతోపాటు మద్యం దుకాణాలు మూతపడ్డాయి.

5 /8

ముక్క, సుక్క బంద్: బుధవారం రోజు చికెన్‌, మటన్‌తోపాటు ఇతర మాంసం దుకాణాలు బంద్‌ కానుండగా.. మద్యం కూడా ఎక్కడా లభించదు.

6 /8

అహింస దినోత్సవం: గాంధీ జయంతిని అహింస దినోత్సవంగా పరిగణిస్తుండడంతో ఆరోజు జీవ హింస చేయరు. అందులో భాగంగానే మాంసం దుకాణాలు మూతపడ్డాయి.

7 /8

డ్రై డే: గాంధీ జయంతి కారణంగా ముక్క, సుక్క లేకుండానే పెద్దల అమావాస్య ముగియనుంది.

8 /8

రోజంతా బంద్: తెలంగాణలో బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు మద్యం దుకాణాలు మూతపడి ఉండనున్నాయి.