TET Examination 2024: తెలంగాణలో టీచర్ పోస్టులకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు అదిరిపోయే గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ తాజాగా, టెట్ ఎగ్జామ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
సీఎం రేవంత్ రెడ్డి టీచర్ పొస్టుల కోసం చదువుకుంటున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పినట్లు తెలుస్తొంది. తాజాగా.. తెలంగాణ పాఠశాల విద్యాశాఖ టెట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
అయితే..సీఎం రేవంత్ రెడ్డి ఏడాదికి రెండు సార్లు ఉపాధ్యాయ అర్హత పరీక్షలు (TET) నిర్వహిస్తామని అభ్యర్థులకు మాటిచ్చిన విషయం తెలిసిందే. అన్నమాట ప్రకారం... ఈ ఏడాదిలో రెండోసారి టెట్ నోటిఫికేషన్ ను తెలంగాణ విద్యాశాఖ విడుదల చేసినట్లు తెలుస్తొంది.
మరొవైపు టీచర్ పోస్టుల కోసం లక్షలాది మంది అభ్యర్థులు ఎంతో కష్టపడుతుంటారు. ప్రస్తుతం ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం.. ఈ టెట్ ఎగ్జామ్ లు జనవరిలో జరగనున్నాయి. 2025 జనవరి 1 నుంచి 20వ తేదీ వరకు ఆన్ లైన్లలో టెట్ పరీక్షలు జరగనున్నట్లు విద్యాశాఖ నోటిఫికేషన్లో పేర్కొంది.
అభ్యర్థులు నవంబర్ 5 నుంచి 20వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. అయితే.. స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతి పొందాలంటే టెట్ అర్హత తప్పనిసరిగా ఉండాలని చెప్పడంతో, వేలాది మంది ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు కూడా ఈ పరీక్షలకు హాజరవుతున్నట్లు తెలుస్తొంది.
ప్రస్తుతం రేవంత్ సర్కారు టెట్ ను రెండోసారి నోటిఫికేషన్ ఇవ్వడంతో నిరుద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా ఎలాగైన జాబ్ ను పొందాలని కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తొంది.