New Smartphones: దేశీయంగా ఈ వారం విడులయ్యే స్మార్ట్​ఫోన్లు ఇవే..!

New Smartphones: వివిధ స్మార్ట్​ఫోన్​ కంపెనీలు ఈ వారం వరుసగా.. కొత్త మోడళ్లను  మార్కెట్లోకి విడుదల చేయనున్నాయి. ముఖ్యంగా వివో, రియల్​మీ, ఒప్పొ, ఐకూ, మోటోరొలా నుంచి వస్తున్న కొత్త మోడళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.

  • Feb 21, 2022, 10:10 AM IST
1 /5

వివో నుంచి మిడ్​ రేంజ్​ సెగ్మెంట్​లో మరో 5జీ స్మార్ట్​ఫోన్ విడుదలవ నుంది. ఫిబ్రవరి 21న ఈ ఫోన్​ను విడుదల కానుంది. ఈ ఫోన్​ ధర రూ.25,990 అంచనాలు ఉన్నాయి.

2 /5

ఒప్పొ ఫైండ్​ ఎక్స్​5 సిరీస్​ స్మార్ట్​ఫోన్​ ఫిబ్రవరి 24న విడుదల కానుంది. ఈ ఫోన్​ స్నాప్​డ్రాగన్​ 8 జెన్​ 1  చిప్​సెట్​, డైమెన్సిటీ 9000 ప్రాసెసర్​తో ఈ ఫోన్ రానున్నట్లు తెలుస్తోంది. 6.7 అంగుళాల డిస్​ప్లే, 5000 ఎంఏహెచ్​ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉంటాయని అంచనా.

3 /5

ఐకూ నుంచి ప్రీమియం సెగ్మెంట్​లో 9 సిరీస్​ దేశీయంగా విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 23న ఈ ఫోన్​ విడుదల కానుంది. అమెజాన్​ ద్వారానే ఈ ఫోన్​ను విక్రయించనున్నారు.

4 /5

మోటో నుంచి ఎడ్జ్​ 30 ప్రో ఫిబ్రవరి 24న విడుదల కానున్నట్లు తెలిసింది. సూపర్ ఆమోల్డ్ డిస్​ప్లే వంటి ఫీచర్లు రానున్నట్లు తెలుస్తోంది.

5 /5

రియల్​మీ నుంచి నార్జో 50 స్మార్టర్​ఫోన్​ను ఫిబ్రవరి 24న విడుదల కానుంది. మీడియాటెక్ హీలియో జీ96 ప్రాసెసర్​, ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఇందులో హైలైట్​గా ఉన్నట్లు తెలుస్తోంది.