ఢిల్లీ అసెంబ్లీ నుండి ఎర్రకోటకు మధ్య ఉన్న ఒక రహస్య సొరంగాన్ని పురావస్తు శాఖ అధికారులు గుర్తించారు. బ్రిటీషర్లు ఈ సొరంగ మార్గం నిర్మించినట్లు మరియు స్వాతంత్ర ఉద్యమకారులను అణచివేసేందుకు ఈ మార్గం వినియోగించారని స్పీకర్ రామ్ నివాస్ తెలిపారు.
ఢిల్లీ శాసనసభ మరియు చాందినీ చౌక్‌లోని ఎర్రకోటను కలిపే ఒక రహస్య సొరంగం బయటపడింది. ఈ రహస్య సొరంగాన్ని పురావస్తు శాఖ అధికారులు గుర్తించారు. దీని గురించిన రహాస్యలు మరియు కొన్ని ఫోటోలు చూద్దాం పదండి! (Image courtesy: ANI)
అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయల్ మాట్లాడుతూ ఈ రహస్య సొరంగం గురించి మరిన్ని వివరాలను తెలిపారు.. అవేంటంటే... "స్వాతంత్య్ర సమరయోధులను తరలించేటప్పుడు బ్రిటిష్ వారు ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ సొరంగమార్గాన్ని ఉపయోగించారని" తెలిపారు. (Image courtesy: ANI)
1912 సంవత్సరంలో రాజధానిని కోల్‌కతా నుండి ఢిల్లీకి మార్చినపుడు ఈ అసెంబ్లీ వినియోగించబడింది. దీనిని 1926 లో కోర్టుగా మార్చారు మరియు బ్రిటిషర్లు స్వాతంత్ర్య సమరయోధులను కోర్టుకు తీసుకురావడానికి ఈ సొరంగ మార్గాన్ని ఉపయోగించేవారు. (Image courtesy: ANI)
నిజానికి మేము ఈ సొరంగం గురించి తెలుసుకోటానికి ప్రయత్నించాము.. కానీ ఎలాంటి స్పష్టమైన ఆధారాలను కనిపెట్టలేకపోయమని అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయల్ వాపోయారు. ఈ సొరంగంపైన చాలానే పుకార్లు పుట్టుకొస్తున్నాయన్నారు. (Image courtesy: ANI)
రహస్య మార్గపు ముఖ ప్రదేశాన్ని గుర్తించామని, ఆ మార్గంలో మెట్రో పిల్లర్లు, సీవేజ్ నిర్మాణాలు ఉన్నందున ఆ రహస్య మార్గం మూతబడిందని తెలిపారు. అయితే, సొరంగ మార్గాన్ని పునరుద్ధరించి త్వరలో ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ఆయన స్పష్టం చేసారు. (Image courtesy: ANI)
ఇప్పటికే పనులు ప్రారంభించామని... వచ్చే ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం నాటికి సొరంగం పునరుద్ధరణ పనులు పూర్తవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. స్వాతంత్య్ర సమరయోధులకు పుణ్యక్షేత్రంగా ఈ సొరంగం మారబోతుందని ఆయన తెలిపారు. (Image courtesy: ANI)