Sai Pallavi:తెలుగు సహా సౌత్‌లో తన అందం కంటే టాలెంట్‌తో ఎక్కువగా పాపులర్ అయిన నటి సాయి పల్లవి. మలయాల మూవీ 'ప్రేమమ్' సినిమాలో మలర్‌గా మల్లూవుడ్ ప్రేక్షకుల మనసు దోచిన ఈ చిన్నది.. ఆ తర్వాత తన నటనతో టాలీవుడ్ ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. తన పాత్ర నచ్చితేనే సినిమాలు చేసే ఈ చిన్నది.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వచ్చాయి. ఆ సంగతి పక్కన పెడితే.. సాయి పల్లవి కంటే ముందు ఆమె చెల్లెలు పూజా కన్నన్ త్వరలో పెళ్లి పీఠలు ఎక్కబోతుంది. ఈ సందర్భంగా సాయి పల్లవి సిస్టర్ నిశ్చితార్ధ వేడుకలు ఘనంగా జరిగాయి. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఘనంగా సాయి పల్లవి చెల్లెలు పూజా కన్నన్ ఎంగేజ్మెంట్ వేడుకలు
వేడుకల్లో సందడి చేసిన సాయి పల్లవి కుటుంబ సభ్యులు
చెల్లెలి నిశ్చితార్ధ వేడుకల్లో ప్రత్యేక నృత్యాలతో అలరించిన సాయి పల్లవి
పూజా కన్నన్ ఎంగేజ్మెంట్ వేడుకలకు హాజరైన సాయి పల్లవి సన్నిహితులు, కుటుంబ సభ్యులు..
సినిమా ఇండస్ట్రీ నుంచి పెద్దగా ఎవరని పిలవని సాయి పల్లవి.. ప్రస్తుతం నాగ చైతన్యతో 'తండేల్' మూవీ చేస్తున్న భామ..