Ola Roadster: అబ్బా ఏం ఉంది భయ్యా.. ఓలా నుంచి మరో EV బైక్‌.. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 200 కిలోమీ నాన్‌స్టాప్‌..

Ola Roadster Price: ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ నుంచి మార్కెట్‌లోకి అద్భుతమైన మోటర్‌సైకిల్‌ లాంచ్‌ కానుంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిని కంపెనీ రేపే లాంచ్‌ చేయబోతోంది.

Ola Roadster Price: భారత మార్కెట్‌లో ఎలక్ట్రిక్ మోటర్‌ సైకిల్స్‌ డిమాండ్‌ రోజు రోజుకు పెరిగిపోతోంది. అద్భుతమైన ఫీచర్స్‌తో కూడిన బైక్స్‌ లాంచ్‌ అవుతున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రముఖ ఎలక్ట్రిక్‌ స్కూటర్స్‌ తయారీ కంపెనీ ఓలా కొత్త మోటర్‌ సైకిల్‌ను లాంచ్‌ చేయబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అతి శక్తివంతమైన ఇంజన్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి ఈ బైక్‌కి సంబంధించిన పూర్తి వివరాలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 
 

1 /5

ఓలా ఎలక్ట్రిక్ మోటర్‌సైకిల్‌ ఫిబ్రవరి 5న కంపెనీ అధికారికంగా విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా ఈ బైక్‌కి సంబంధించిన అన్ని వివరాలు సోషల్ మీడియా Xలో విపరీతంగా వైరల్‌ అవుతున్నాయి. ఇది OLA రోడ్‌స్టర్ పేరుతో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది.

2 /5

ఈ OLA రోడ్‌స్టర్ వివిధ మోడల్స్‌లో లాంచ్‌ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది అద్భుతమైన ఇంజన్‌తో విడుదల కానుంది. ఈ బైక్‌కి సంబంధించిన అన్ని రకాల వివరాలను ఓలా  CEO భవిష్ అగర్వాల్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.   

3 /5

ఈ OLA రోడ్‌స్టర్ మోటర్‌సైకిల్‌ ఎవ్వరు ఊహించని ఫీచర్స్‌తో లాంచ్‌ అయ్యే ఛాన్స్‌ ఉందని మార్కెట్‌లో పెద్ద టాక్.. అలాగే ఈ బైక్‌ రెండు చక్రాలకు డిస్క్ బ్రేక్‌లను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇది మూడు రైడింగ్ మోడ్‌ల (స్పోర్ట్స్, నార్మల్, ఎకో) లో రాబోతోంది.

4 /5

అంతేకాకుండా ఇది ఓలా మ్యాప్ టర్న్-బై-టర్న్ నావిగేషన్‌ను కూడా కలిగి ఉండనుంది. దీంతో పాటు అద్భుతమైన డిజిటల్ కీ లాక్ వంటి కొత్త ఫీచర్‌ను కలిగి ఉండబోతోంది. అలాగే ఇది ఎంతో శక్తివంతమైన 4.5 kWh బ్యాటరీ సామర్థ్యంలో విడుదల కానుంది. ఇవే కాకుండా ఇతర ఫీచర్స్‌ను కూడా కలిగి ఉంటుంది..

5 /5

ఇక ఈ బైక్‌కి సంబంధించిన మైలేజీకి సంబంధంచిన వివరాల్లోకి వెళితే.. ఇందులోని టాప్ వేరియంట్‌ 200 కిలోమీటర్ల మైలజీతో విడుదల కానుంది. ఓలా రోడ్‌స్టర్ X మోటర్‌సైకిల్‌కి సంబంధించిన ధరను కంపెనీ త్వరలోనే వెల్లడించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం..