Neha Shetty: పట్టు చీరలో మెరిసిపోయిన నేహా శెట్టి…ఏడారిలో ట్రెడిషనల్ అందాలు..

Neha Shetty Hot Photos: డీజే టిల్లు సినిమాలో రాధిక క్యారెక్టర్ తో మన అందరిని మెప్పించిన హీరోయిన్ నేహా శెట్టి. ప్రస్తుతం ఈ హీరోయిన్ ఇంస్టాగ్రామ్ తో షేర్ చేస్తున్న ఫోటోలు అభిమానులను ఫిదా చేస్తున్నాయి..

  • Feb 29, 2024, 19:51 PM IST
1 /6

మోడలింగ్‌తో  తన కెరీయర్ ని ప్రారంభించిన నేహా శెట్టి 2014లో మిస్ మంగళూరు అందాల పోటీతో గెలిచింది. అంతేకాకుండా తను మిస్ సౌత్ ఇండియా 2015 రన్నరప్‌గా నిలిచింది.

2 /6

కాగా దర్శకుడు శశాంక్ తీసిన కన్నడ చిత్రం ముంగారు మలే 2 తో సినిమాలలోకి తెరంగేత్రం చేసింది ఈ హీరోయిన్. ఈ సినిమాకి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, నేహా నటనకు మాత్రం ప్రశంసలు లభించాయి.

3 /6

పూరి జగన్నాధ్ దర్శకత్వం మెహబూబా సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది ఈ హీరోయిన్. ఈ సినిమా కోసం ఆమె తెలుగు భాష నేర్చుకున్నది. 

4 /6

ఇక ఆ తరువాత దాదాపు మూడు సంవత్సరాలు గ్యాప్ తీసుకున్న ఈ హీరోయిన్ అఖిల్ హీరోగా చేసిన  మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌లో చిన్న పాత్రతోపాటు గల్లీ రౌడీలో హీరోయిన్ గా చేసింది.

5 /6

అయితే ఈ సినిమాలు ఏవి ఆమెకు తెచ్చిపెట్టని పేరు సిద్దు జొన్నలగడ్డతో తీసిన డీజే టిల్లు తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో ఆమె చేసిన రాధిక పాత్ర హైలెట్ గా నిలిచింది.  

6 /6

ప్రస్తుతం రెండు, మూడు తెలుగు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్న ఈ హీరోయిన్ ఇంస్టాగ్రామ్ లో.. అందమైన చీరలో షేర్ చేసిన ఫోటోలు ఆమె అభిమానులను తెగ అక్కట్టుకుంటున్నాయి.