E- Racing: కేటీఆర్‌కు బిగుస్తున్న ఉచ్చు.. ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు గవర్నర్‌ అనుమతి కోరిన ప్రభుత్వం.. ఫార్మూలా ఈ రేసింగ్ వ్యవహారం ఏంటి?

KTR In Formula E- Racing: ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారంలో ఏసీబీ దూకుడు పెంచింది. కేటీఆర్‌పై ఎఫ్ఐఆర్‌ నమోదు చేయడానికి గవర్నర్‌కు ప్రభుత్వం ఇప్పటికే లేఖ రాసింది. దీంతో త్వరలోనే కేటీఆర్‌ కార్నర్‌ చేసి అరెస్ట్ చేస్తారని రాజకీయ, మీడియా వర్గాలు చెబుతున్నాయి. 
 

1 /7

అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ఈరేసింగ్‌ వ్యవహారంలో త్వరలో కేటీఆర్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు కానున్నట్లు వైరల్‌ అవుతోంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గవర్నర్‌కు లేఖ రాశారు. దీనికి గవర్నర్‌ న్యాయ సలహా కోరినట్లు తెలుస్తోంది.  

2 /7

అంతేకాదు అప్పటి రాజకీయ పెద్దలను కూడా ఈ కేసుకు సంబంధించి చర్యలు తీసుకుంటున్నారు. ఈనేపథ్యంలోనే అప్పట పురపాలక సీఎస్‌ అర్వింద్‌ కుమార్‌పై చర్యలకు ప్రభుత్వానికి ఏసీబీ కోరగా అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది.  

3 /7

ఫార్ములా ఈరేసింగ్ ఎలా నిర్వహించారని మున్సిపల్‌ శాఖల రికార్డులను పరిశీలిస్తోంది. త్వరలో నోటీసులు ఇచ్చే యోజనలో ఏసీబీ ఉంది. హైదరాబాద్‌లోని నెక్లెస్‌ రోడ్డులో ఈ రేసింగ్‌ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్వహించింది. ఇప్పటికే రెండు సీజన్‌లు నిర్వహించారు. అయితే, లాభాలు రాకపోవడంతో నిర్వాహకులు ఆసక్తి చూపలేదు  

4 /7

విదేశీ కంపెనీలకు దాదాపు రూ.55 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. దీనిపై ఏసీబీ ఇన్వెస్టిగేషన్‌ చేస్తోంది. ఇది కేటీఆర్‌కు ఉచ్చు బిగిస్తుంది. దీనికి సంబంధించిన అధికారులకు నోటీసులు ఇచ్చి విచారణకు ఏసీబీ పిలవనుంది.  

5 /7

ఈ రేసింగ్‌లో పర్మిషన్‌ లేకుండా విదేశీ సంస్థకు ఇలా చెల్లింపులు ఏ ప్రాతిపదికనా చెల్లించారనేది తేల్చనున్నారు. అంత పెద్ద మొత్తం ఓ విదేశీ సంస్థకు చెల్లించాలంటే ఆర్బీఐ అనుమతి కూడా ఉండాలి. ఈ కేసులో ఏదైనా అవకతవకాలు బయటకు వస్తే బీఆర్‌ఎస్‌ టాప్‌ మోస్ట్‌ లీడర్‌ కేటీఆర్‌పై కేసు నమోదు చేయన్నట్లు తెలుస్తోంది.  

6 /7

ఈ రేసింగ్‌ వ్యవహారం ఏంటి? 2022 లో హైదరాబాద్‌లోని ప్రముఖ పర్యాటక ప్రదేశం అయిన నెక్లేస్‌రోడ్‌లో గత ప్రభుత్వం ఈ రేసింగ్‌ ఏస్‌ నెక్ట్స్‌ జెన్‌ ప్రైవేటు లిమిటెడ్‌తో ఒప్పందం చేసుకుంది. దీనికి సంబంధించి ఓ రెండు సీజన్‌లు కూడా నిర్వహించింది. ఒక సీజన్‌ నిర్వహించిన తర్వాత రెండో సీజన్‌కు ప్రమోటర్‌ ఆసక్తి చూపలేదు. అయితే, రద్దు కూడా చేసుకోలేదు. కానీ, మున్సిపల్ శాఖ ద్వారా ముందస్తుగా రూ.55 కోట్లను చెల్లించింది.

7 /7

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ రేసింగ్‌ సంస్థలో ఒప్పందం రద్దు చేసుకుంది.  న్యాయపరంగా కేసును ముందుకు తీసుకు వెళ్లడానికి గవర్నర్‌ అనుమతి తీసుకుంటున్నారు. అనుమతి వచ్చిన వెంటనే అవతవకలు తేలితే అప్పటి సీనియర్‌ అధికారులతోపాట కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.