Keerthy Suresh:పూర్తిగా మారిపోయిన కీర్తి సురేష్.. మహానటిలో ఈ యాంగిల్ ను ఎవరు ఎక్స్ పెక్ట్ చేయరు..

Keerthy Suresh: కీర్తి సురేష్. మలయాళ భామ అయిన  తెలుగులో 'నేను శైలజా' మూవీతో నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత  మహానటి సినిమాతో తెలుగులో సూపర్ క్రేజ్ సంపాదించుకుంది.  మహానటి చిత్రంతో జాతీయ ఉత్తమ నటి పురస్కారం అందుకొని సంచలనం రేపింది. ప్రస్తుతం తెలుగు, తమిళం సహా పలు భాషా చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. త్వరలో హిందీ చిత్రసీమలో అడుగుపెట్టబోతుంది. 

1 /9

కీర్తి సురేష్ పేరేంట్స్  ఇద్దరు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారు కావడంతో ఈమె బాలనటిగా మలయాళ సినిమాలతో ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. 

2 /9

కాస్త పెద్దయ్యకా.. మలయాళంలో తెరకెక్కిన  'గీతాంజలి' చిత్రంతో కథానాయకగా వెండితెరకు పరిచయమైంది. 

3 /9

మలయాళం తర్వాత తమిళంలో 'ఇదు ఎన్న మాయమ్' మూవీతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.  ఆ సినిమాలో కీర్తి సురేష్ నటనకు మంచి మార్కులే పడ్డాయి.

4 /9

తెలుగులో కీర్తి సురేష్ ఫస్ట్ మూవీ 'నేను శైలజా'. రామ్ పోతినేని హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. 

5 /9

  తెలుగులో కాస్త గ్యాప్‌తో పవన్ కళ్యాణ్ హీరోగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అజ్ఞాతవాసి' సినిమాలో నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా వర్కౌట్ కాలేదు.

6 /9

  నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మహానటి సావిత్రి జీవితంపై తెరకెక్కిన 'మహానటి' మూవీలో సావిత్రమ్మ పాత్రలో కీర్తి సురేష్ ఒదిగిపోయింది. ఈ సినిమాలో తన నటనతో సాక్షాత్తూ సావిత్రి వచ్చి నటించిందా అనే తీరులో నటించి మెప్పించింది. ఈ సినిమాలోని అద్భుత నటనక జాతీయ ఉత్తమ నటి అవార్డు వెతుక్కుంటూ కీర్తి సురేష్ ను వరించింది. 

7 /9

లాస్ట్ ఇయర్ తెలుగులో నాని సరసన దసరా మూవీతో హిట్ అందుకుంది. ఆ తర్వాత చిరంజీవి హీరోగా నటించిన 'భోళా శంకర్' మూవీ నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా వర్కౌట్ కాలేదు.

8 /9

ఇక మహేష్ బాబు సరసన పరశురామ్ పేట్ల దర్శకత్వంలో తెరకెక్కిన 'సర్కారు వారి పాట'లో కీర్తి సురేష్ నటనకు మంచి మార్కులే పడ్డాయి.

9 /9

ఇప్పటి వరకు దక్షిణాదిలో కన్నడ మినహా అన్ని ఇండస్ట్రీస్‌లో నటించిన కీర్తి సురేష్‌.. త్వరలో 'బేబి జాన్' మూవీతో హిందీ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టబోతుంది.  ఈ సినిమా విజయ్ హీరోగా నటించిన 'తేరి' మూవీకి రీమేక్‌గా తెరకెక్కుతోంది.