IBPS 2025: ఐబీపీఎస్‌ ఎగ్జామ్ కేలండర్‌ విడుదల.. ఈ ఏడాది నిర్వహించనున్న బ్యాంకు పరీక్ష తేదీలు ఇవే..

IBPS Job Calendar Released 2025: ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ (IBPS) ఎగ్జామ్ పరీక్ష క్యాలెండర్ విడుదల చేసింది. 2025 కు సంబంధించి క్యాలెండర్ విడుదల నేడు విడుదల చేసింది. బ్యాంకు పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు ఈ క్యాలెండర్‌ను క్షుణ్నంగా చదివిన తర్వాత అప్లై చేసుకోవాలి. ఆఫీసర్ స్కేల్ 1 జూలై 27 తేదీన నిర్వహించనున్నారు. ఇంకా ఐబీపీఎస్ PSB రిక్రూట్మెంట్ కూడా ఏడాదిలో నిర్వహించనున్నారు  ప్రొబేషనరీ, మేనేజ్మెంట్ ట్రైనీ, స్పెషలిస్ట్ ఆఫీసర్ వంటి పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
 

1 /5

బ్యాంకు జాబ్ సాధించాలని అభ్యర్థులకు శుభవార్త చెప్పింది ఐబీపీఎస్. ఈ ఏడాదికి సంబంధించిన ఎగ్జామ్‌ క్యాలెండర్‌ను విడుదల చేసింది. స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. ఇందులో ఐబీపీఎస్ పీవో, క్లెరికల్‌, స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. దానికి సంబంధించిన ఎగ్జామ్ తేదీలు ఫలితాల వివరాలను వెబ్సైట్లో పొందుపరిచారు. అధికారిక వెబ్‌సైట్‌ IBPS.In పూర్తి వివరాలు ఉన్నాయి.  

2 /5

ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ 2025.. ఐబీపీఎస్ ఆఫీస్ అసిస్టెంట్ స్కేల్ 1, 2, 3 ఎగ్జామ్ పోస్టుల తేదీలను కూడా విడుదల చేశారు. జూలై 27న ఈ పరీక్ష నిర్వహించనున్నారు ఇక స్కేల్ టు స్కేల్ త్రి కి ఆగస్టు 2న నిర్వహిస్తారు ఆఫీస్ అసిస్టెంట్కు ఆగస్టు 3న ఈ ముగ్గురికి మెయిన్స్ ఎగ్జామ్ కూడా సెప్టెంబర్ 13 తేదీల్లో నిర్వహిస్తారు ఇక ఆఫీస్ అసిస్టెంట్ కు నవంబర్ 9న నిర్వహించనున్నారు.

3 /5

ఐబీపీఎస్ పీవో, స్పెషలిస్ట్‌ ఆఫీసర్ ఎగ్జామ్‌ ఇంపార్టెంట్ తేదీలు ఇక ప్రొఫెషనరీ ఆఫీసర్ కి సంబంధించిన ప్రిలిమినరీ ఎగ్జామ్ అక్టోబర్ 4,  నవంబర్ 22 డిసెంబర్ 7 నిర్వహిస్తారు. స్పెషలిస్ట్ ఆఫీసర్ అక్టోబర్ 5 సిఎస్సి అక్టోబర్ 11. ప్రొఫెషనరీ ఎగ్జామ్ మెయిన్స్ ఎగ్జామ్ నవంబర్ 29 నిర్వహించారు. స్పెషలిస్ట్ ఆఫీసర్ జనవరి 4, 2026 కస్టమర్ సర్వీస్ అసోసియేట్ ఫిబ్రవరి 1, 2026న నిర్వహించనున్నారు.  

4 /5

 ఐబీపీఎస్‌ పరీక్షలకు అప్లై చేసుకునే విధానం అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి. దీనికి ప్రిలిమినరీ, మెయిన్స్ ఎగ్జామ్ కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నిర్దిష్ట ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ సైజు థంబ్‌ ఇంప్రెషన్ వంటివి జేపీఈజీ ఫార్మేట్ లో ఉండేలా చూసుకోవాలి.  

5 /5

అంతేకాదు వీటి అన్నిటిని స్కాన్ చేసి అక్కడ సూచించిన ఫార్మాట్లో డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత పరీక్ష తేదీకి ముందుగానే హాల్‌ టిక్కెట్లు విడుదల చేస్తారు. వాటిని ప్రింట్‌ తీసి ఫోటో పేస్ట్ చేయాలి. మీతోపాటు పరీక్షలకు ఏదైనా ఐడెంటిటీ ప్రూఫ్‌ కూడా తీసుకువెళ్లాల్సి ఉంటుంది.