Gold Rate Today: బంగారం కొనడం కష్టమే.. నేడు భారీగా పెరిగిన పసిడి.. తులం 84వేలకు చేరువలో

 Gold Rate Today: దేశంలో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన వారం రోజులుగా పసిడి  ధర వరుసగా పెరుగుతూ వస్తుంది. ప్రస్తుతం బంగారం ధర 84 వేల రూపాయల దిశగా అడుగులు వేస్తోంది. దీంతో పసిడిప్రియులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కొత్త ఏడాదిలో బంగారం ధరలు తగ్గుతాయని భారీగా పెరుగుతుండటంతో వారిలో ఆందోళన నెలకొంది. 
 

1 /7

 Gold Rate Today: దేశంలో బంగారం ధరలు మళ్ళీ పెరుగుతున్నాయి. కొత్త ఏడాదిలో బంగారం ధరలు తగ్గుతాయని ఆశపడిన పసిడి ప్రియులకు తీవ్ర నిరాశే ఎదురవుతుంది. ఎందుకంటే బంగారం ధరలు గత నాలుగైదు రోజుల నుంచి భారీగా పెరుగుతున్నాయి.

2 /7

 ప్రస్తుతం తులం బంగారం ధర 84 వేల రూపాయల దిశగా ప్రయాణిస్తుంది. ఈ నేపథ్యంలో బంగారం కొనుగోలు చేయాలంటే భయపడుతున్నారు.  ఎందుకంటే మన దేశంలో పెళ్లిళ్లు, శుభకార్యాలు, ఇలా ఏ సందర్భం వచ్చిన బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడం ఆనవాయితీగా వస్తోంది.   

3 /7

ప్రస్తుతం దేశంలోని ప్రధాన  నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. హైదరాబాదులో ఈరోజు 10 గ్రాముల బంగారం  22 క్యారెట్ల 250 రూపాయలు పెరిగింది. 24 క్యారెట్ల కు 250 రూపాయల చొప్పున పెరిగింది. దీంతో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 72,850 చేరుకుంది. అదే 24 క్యారెట్ల బంగారం ధర 79 వేల 470కి ఎగిసింది. త్వరలోనే బంగారం ధర 80,000 దాటే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

4 /7

ప్రస్తుతం పెరుగుతున్న బంగారం ధరల కారణంగా బంగారం కొనుగోలు చేయాలంటే భారంగా మారిపోయే అవకాశం ఉంది. దీనికి తోడు అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు కూడా బంగారం ధరలు పెరిగేందుకు దోహదం చేస్తున్నాయి.  

5 /7

 బంగారం ధరలు వరుసగా పెరిగేందుకు ప్రధానంగా మరో కారణం కూడా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొంటున్న అమ్మకాల ఒత్తిడి అని చెప్పవచ్చు. ముఖ్యంగా అమెరికాలో స్టాక్ మార్కెట్లో పెద్ద ఎత్తున నష్టాలు నమోదు అవుతున్నాయి.  దీంతో పెట్టుబడిదారులు తమ ఇన్వెస్టను బంగారం వైపు తరలిస్తున్నారు.  

6 /7

 బంగారం ధర ప్రస్తుతం అమెరికాలో ఒక ఔన్స్ ధర 2720డాలర్ల  వద్ద ట్రేడ్ అవుతుండగా ఈరోజు అమెరికాలో బంగారం ధర 30 డాలర్లకు పెరిగింది.  ఈ ప్రభావం మన దేశంపై కూడా కనిపిస్తుంది.  

7 /7

 బంగారం ధరలు పెరగడానికి మరో ముఖ్యమైన కారణం.. తాజాగా జనవరి చివరి వారంలో అమెరికా అధ్యక్ష బాధ్యత చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్  వ్యాపార విధానాల్లో కరాకండిగా చెప్పేస్తున్నారు. దీంతో మార్కెట్లలో  ఆందోళనకర పరిస్థితులు నెలకున్నాయి. ఇది కూడా బంగారం ధరలు పెరిగేందుకు దోహదం పడింది అని చెప్పవచ్చు .