Gold price today : పసిడి ప్రియులకు పండగలాంటి వార్త..మరింత తగ్గిన బంగారం ధర..వెండి ధర ఎంతంటే?

Gold Price Today : బంగారం ధర స్వల్పంగా తగ్గుముఖం పట్టింది నిన్నటితో పోల్చి చూస్తే బంగారం ధర నేడు వంద రూపాయలు తగ్గింది. నవంబర్ 4వ తేదీ సోమవారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 80,830 రూపాయలుగా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 74,200 రూపాయలుగా ఉంది. 

1 /6

Gold Price Today : పసిడి ధరలు ఇప్పటికి కూడా ఆల్ టైం రికార్డు సమీపంలోనే ఉంటున్నాయి. బంగారం ధరలు ఈ రేంజ్ లో పెరగడానికి ప్రధానంగా అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా బంగారం ధరలు పెరగడానికి అమెరికా అధ్యక్షుడు ఎన్నికలు ప్రస్తుతం ఉన్న కారణంగా చెప్పవచ్చు. అంతర్జాతీయ పరిణామాలు బంగారం హెచ్చుతగ్గులకు కారణం అవుతూ ఉంటాయి.

2 /6

ఎందుకంటే స్టాక్ మార్కెట్ లు కానీ ఇతర పెట్టుబడులలో అనిశ్చితి ఏర్పడినప్పుడు, ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం వైపు తరలిస్తూ ఉంటారు. ఎందుకంటే బంగారం అనేది ఒక సురక్షితమైన పెట్టుబడి. చాలా దేశాలు సైతం బంగారం నిల్వలను పెంచుకుంటూ ఉంటాయి. ఎందుకంటే సంక్షోభ సమయంలో బంగారం ఉపయోగపడుతుందని ఆయా దేశాలు ముందు జాగ్రత్త చర్యగా బంగారం నిల్వలను పెద్ద ఎత్తున పెంచుకుంటాయి.

3 /6

తాజాగా చైనా, భారత్ బంగారం నిలువలను పెంచుకునే క్రమంలో ఉన్నాయి. ముఖ్యంగా చైనా పెద్ద ఎత్తున బంగారం నిలువలను పెంచుకుంటోంది. బంగారం ధరలు ప్రస్తుతం ఉన్న ధర నుంచి మరికొద్దిగా తగ్గే  అవకాశం  ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.

4 /6

ఎందుకంటే ఎవరైతే బంగారం పై పెట్టుబడి పెట్టారో వారు లాభాల స్వీకరణ కోసం బంగారాన్ని విక్రయించే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో బంగారం ధర స్వల్పంగా ఒడిదుడుకులకు లోన అయ్యే అవకాశం ఉంటుంది.   

5 /6

ప్రస్తుతం ఉన్న ధర నుంచి బంగారం ధర కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ బంగారం ధరలు భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం సైతం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. భవిష్యత్తులో బంగారం ధర ఒక లక్ష రూపాయలు తాకవచ్చని అంచనాలు వేస్తున్నారు. అయితే 2025 సంవత్సరంలో ఇది సాగే అవకాశం ఉంది. బంగారం ధర గత సంవత్సరంతో పోల్చి చూసినట్లయితే ప్రస్తుతం దాదాపు 18 వేల రూపాయలు పెరిగింది.

6 /6

ఈ పరిస్థితిలో బంగారం పెరిగినట్లయితే 2025 సంవత్సరంలో బంగారం ధర ఒక లక్ష రూపాయలు తాకే అవకాశం ఉంటుంది. బంగారం ధర ప్రస్తుత ధర నుంచి ఎంత పెరిగినా రికార్డు అయ్యే అవకాశం ఉంటుంది. అయితే బంగారం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఆభరణాలు కొనుగోలు చేసేవారు జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు.