Amrapali Kata: ఆమ్రపాలీని అందుకే టార్గెట్ చేశారా..?... ఆమె ఏపీ వెళ్లడం వెనుక అసలు కథ ఏంటంటే..?

Amrapali: జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలీ కాటతో పాటు, మరికొందరు ఐఏఎస్, ఐపీఎస్ లను ఏపీ క్యాడర్ కు రిపోర్టు చేసుకొవాలని కూడా కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
 

1 /8

ప్రస్తుతం తెలంగాణలో కొన్నినెలల క్రితమే కొలువు దీరింది.  రేవంత్ పాలన పగ్గాలు చేపట్టాగానే గత సర్కారు హాయాంలో ఉన్న అధికారులకు బదిలీ చేశారు. ఏరికోరి కొంత మంది ఐపీఎస్, ఐఏఎస్ లను ముఖ్యమైన స్థానాలలో నియమించుకున్నారు.   

2 /8

వీరిలో ఇటీవల జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలీ కూడా ఒకరిగా చెప్పుకొవచ్చు. ఆమె జీహెచ్ఎంసీ కమిషనర్ గా పాలనచేపట్టినప్పటి నుంచి బల్దియాలో అనేక మార్పులు తీసుకొచ్చారని తెలుస్తోంది.   

3 /8

ముఖ్యంగా ఒక వైపు తమ శాఖలోని ఉద్యోగులతో సమన్వయం చేసుకుంటునే.. మరోవైపు హైదరబాద్ ప్రజలకు గ్రౌండ్ లెవల్ లో అందుబాటులో ఉంటూ వారి సమస్యల్ని సైతం తెలుసుకునేవారు.

4 /8

ఇటీవల వరదలు వచ్చినప్పుడు సైతం  ఆమ్రపాలీ వరద ప్రభావిత  ప్రాంతాలకు వెళ్లీ మరీ అక్కడి పరిస్థితుల్ని తెలుసుకున్నారు. అధికారులకు ఎప్పటి కప్పుడు ఆదేశాలు జారీచేస్తు, ప్రజలకు ఇబ్బందులు కల్గకుండా చూడాలని చెప్పేవారు.    

5 /8

ఈ నేపథ్యంలో అనూహ్యాంగా.. ఆమ్రపాలీతొ పాటు మరికొందరు ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు ఏపీకి రిపోర్టు చేసుకొవాలని కేంద్రం డీవోపీటీ ఆదేశాలు జారీ చేసింది. సీఎం రేవంత్ సర్కారును మరోసారి ఇబ్బందుల్లొ నెట్టేందుకు కేంద్రం పావులు కదుపుతోందని జోరుగా చర్చ జరుగుతుంది.

6 /8

 అదే విధంగా.. ఆమ్రపాలీ డైనమిక్ గా ఉండటం... పాలనలో స్పీడ్ ను పెంచడం వల్ల కూడా ఆమెను తప్పిస్తే.. కొత్త వాళ్ల అంతతొందరగా ఇక్కడ ఇమడలేరని ఇలా చేసినట్లు కూడా ప్రచారం జరుగుతుంది. ఆమ్రపాలీ యూపీఎస్సీ అప్లికేషన్ లో తన పర్మినెంట్ అడ్రస్ ను విశాఖ పట్నంగా పేర్కొన్నారు.

7 /8

 అందుకే ఏపీ క్యాడర్ కేటాయించినట్లు తెలుస్తొంది.  ఇదిలా ఉండగా.. 2010 బ్యాచ్ కు చెందిన ఆమ్రపాలీ.. వికారాబాద్ కుతొలుత సబ్ కలెక్టర్ గా వెళ్లారు. హైదరాబాద్ వుమెన్ వెల్ఫెర్ శాఖలో పనిచేశారు.

8 /8

2015 లో రంగారెడ్డి జాయింట్ కలెక్టర్ గా, కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత.. వరంగల్ అర్బన్ జిల్లాకు కలెక్టర్ గా విధులు నిర్వర్తించారు. అక్కడ నుంచి  జీహెచ్ఎంసీ కమిషనర్ గా నియమితులయ్యారు. అదేవిధంగా తెలంగాణ ఎన్నికల సమయంలో.. జాయింట్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ గా కూడా సేవలు అందించారు.  2020లో కేంద్ర సర్వీసుల్లో.. డిప్యూటీ కార్యదర్శిగాను సేవలందించారు.