Waterfalls near Hyderabad:హైదరాబాద్‌కు అతి సమీపంలో ఉన్న టాప్ 5జలపాతాలు ఇవే..ఒక్క రోజులో వెళ్లిరావచ్చు.!!

 Waterfalls near Hyderabad:వర్షాకాలంలో జలపాతాలను చూస్తుంటే మనస్సుకు ఎంతో హాయిగా ఉంటుందో కదా. కొండంచుల నుంచి సొగసుగా జాలువారే నీటి తుంపర్లు..పచ్చని పైర్లకు తెల్లని చీర కట్టిన చందంగా..కొండలపైనుంచి జాలువారుతుంటే..ఆ అందాన్ని వర్ణించలేము. ఇలాంటి జలపాతాలు మీకు దగ్గరలో ఎక్కడ ఉన్నాయని ఆలోచిస్తున్నారా? మరెందుకు ఆలస్యం హైదరాబాద్ చుట్టుపక్కల కేవలం ఒక్కరోజులోనే చుట్టేయ్యాల్సిన జలపాతాలకు వెళ్లిరండి.

  • Jul 21, 2024, 19:27 PM IST
1 /8

వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది ఆలోచించేది వాటర్ ఫాల్స్ గురించే. కొండలమీద నుంచి పాలపొంగుల పారుతున్న జలపాతాలను చూస్తుంటే మనస్సుకు హాయిగా అనిపిస్తుంది. కొండంచుల నుంచి సొగసుగా జాలువారే నీటి తుంపర్లు మనస్సును స్వర్గంలోకి తీసుకెళ్తాయి. ఇలా జాలువారే జలపాతాన్నిచూడటం ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతిని కలిగిస్తాయి. ప్రతి జలపాతమూ చూడదగ్గదే అయినప్పకీ కొన్ని మాత్రం మరింత ప్రత్యేకంగా ఉంటాయి. మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు అతి సమీపంలో ఉన్న అలాంటి జలపాతాల నుంచి గురించి మనమూ ఓ లుక్కెద్దామా?

2 /8

ఈ జలపాతం హైదరాబాద్ కు సుమారు 300కిలోమీటర్ల దూరంలో భద్రచలానికి 120కిలోమీటర్లు ఉంటుంది. ఛత్తీస్ ఘడ్ దండకారుణ్యం నుంచి ప్రవహించే గోదావరి నదిపై ఈ జలపాతం జాలువారుతుంది.

3 /8

హైదరాబాద్ కు 282 కిలోమీటర్ల దూరంలో, ఆదిలాబాద్ కు 51 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ జలపాతం కూడా గోదావరి ఉపనది అయిన కడెం నదిపై ఉంది. ట్రెక్కింగ్ అంటే ఇష్టం ఉన్నవారు ఇక్కడికి వెళ్లవచ్చు. 

4 /8

రాష్ట్ర రాజధాని నుంచి 282 కి.మీ ఉంటుంది. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ఈ జలపాతం ఉంది. గోదావరి నది ఉపనది అయిన పెన్ గంగ మీదుంది. 

5 /8

హైదరాబాద్ నుంచి 270, ఆదిలాబాద్ నుంచి 59 కిలోమీటర్ల దూరంలో ఉంది. కుంటాల జలపాతం నుంచి మరో 20 కిలోమీటర్లు ప్రయాణిస్తే ఈ జలపాతం వస్తుంది.   

6 /8

ఇది వరంగల్ జిల్లాలోని గూడూరు మండలంలో ఉంది. వరంగల్ నుంచి 51 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ జలపాతం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇది మంచి పిక్నిక్ స్పాట్ అని చెప్పవచ్చు. 

7 /8

ఇది హైదరాబాద్ కు 173 కిలోమీటర్ల దూరంలో ఉంది. నాగార్జున సాగర్ నుంచి 14 కిలోమీటర్లు ప్రయాణిస్తే ఎత్తిపోతల జలపాతం వస్తుంది.

8 /8

పొచ్చెర జలపాతానికి 22 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాద్ నుంచి 260 కిలోమీటర్లు ప్రయాణిస్తే..ఈ జలపాతానికి చేరుకుంటాము. గోదావరి ఉపనది అయిన కడెం నదిపై ఈ జలపాతం ఉంటుంది. ఈ జలపాతం కింద గూహలో సోమేశ్వరస్వామి, నంది విగ్రహాలు ఉంటాయి.   

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x