Electric Vehicle New Scheme: ఈ దసరా పండుగకు కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? కేంద్ర ప్రభుత్వం నుంచి బంపర్ ఆఫర్ మీకోసం

EV policy 2024: రాబోయే ఫెస్టివల్ సీజన్ సందర్భంగా ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసే వారికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పీఎంఓ కార్యాలయంలో సైతం చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ స్కీం ఎలాంటి రూపుదిద్దుకుంటుందో చూద్దాం..
 

1 /5

Electric Vehicle New Scheme 2024: పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలకు కళ్లెం వేసేందుకు అలాగే దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకునేందుకు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం సరికొత్త పథకాన్ని ముందుకు తేనుంది. ఇప్పటి అందుబాటులో ఉన్న ఎఫ్ఏఎంఈ స్కీం కి భిన్నంగా సరికొత్త పథకం ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.  

2 /5

 రాబోయే ఫెస్టివల్ సీజన్ దసరా నవరాత్రులతో ప్రారంభం కానుంది. ఈ సీజన్ సంక్రాంతి వరకు కొనసాగనుంది. ఈ నేపథ్యంలో కొత్త వాహనాలను కొనుగోలు చేసే వారికి ఈ వార్త శుభవార్త అయ్యే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం సరికొత్త పథకం గురించి ఇంకా ముసాయిదా దశలోనే ఉన్నట్లు తెలుస్తోంది. జీ బిజినెస్ పోర్టల్ అందిస్తున్న సమాచారం ప్రకారం, ఈ నెలలో ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి ఒక ప్రత్యేకమైన పాలసీని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.   

3 /5

దీనికి గతంలో ఉన్న స్కీంతో సంబంధం లేకుండా సరికొత్త పేరుతో కొత్త పాలసీని అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ కొత్త పాలసీ ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలను రూపొందించేందుకు వివిధ రకాల దశల్లో ఇవి కంపెనీలకు మద్దతు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధం అవుతోంది.

4 /5

దీనికి సంబంధించి త్వరలోనే పీఎంఓ సమావేశమయ్యే అవకాశం ఉంది. ఈ పాలసీ కోసం పదివేల కోట్లను సైతం ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్స్ స్కీం సెప్టెంబర్ నెల చివరి నాటికి ముగియనుంది.   

5 /5

ఈ నేపథ్యంలో కొత్త స్కీం దిశా దశ ఎలా ఉంటాయన్న దానిపై సర్వత్రా చర్చ నడుస్తోంది. అయితే ఇప్పటికే మేకిన్ ఇండియా ప్రోత్సాహానికి కేంద్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది. ఇందులో భాగంగా స్వదేశంలో ఉత్పత్తి అయ్యే ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రత్యేక ప్రోత్సాహకాలను అదేవిధంగా సబ్సిడీలను సైతం అందించే దిశగా ఈ కార్యక్రమం ఉండే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.