Diabetes Plants: ఇంట్లో కుండీల్లో పెంచుకునే ఈ 3 మొక్కలతో ఇన్సులిన్ రోగులకు సైతం ఉపశమనం

Diabetes Plants: ఇటీవలి కాలంలో డయాబెటిస్ సమస్య తీవ్రమౌతోంది. ఒకసారి మధుమేహం సోకితే ఇక జీవితాంతం వెంటాడుతుంది. కానీ ప్రకృతిలో లబించే కొన్ని మొక్కలతో  బ్లడ్ షుగర్ లెవెల్స్ అద్భుతంగా తగ్గించవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆ మొక్కలేవో తెలుసుకుందాం.

Diabetes Plants: మధుమేహం అనేది వాస్తవానికి చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి కారణంగా వస్తుంటుంది. ఇంకా ఇప్పటికే మధుమేహానికి పూర్తి స్థాయిలో చికిత్స అందుబాటులో లేదు. అందుకే మధుమేహం వ్యాధిగ్రస్తులు ఆరోగ్యంపై చాలా జాగ్రత్తగా ఉండాలి. హెల్తీ డైట్ తీసుకోవడం, తగిన వ్యాయామం చాలా అవసరం. అయితే ప్రకృతిలో లభించే ఈ మూడు మొక్కలతో మధుమేహాన్ని అద్భుతంగా నియంత్రించవచ్చు. ఈ మొక్కలు ఇన్సులిన్ సమస్యకు కూడా పరిష్కారం చూపిస్తాయి.

1 /4

మధుమేహం అనేది వాస్తవానికి చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి కారణంగా వస్తుంటుంది. ఇంకా ఇప్పటికే మధుమేహానికి పూర్తి స్థాయిలో చికిత్స అందుబాటులో లేదు. అయితే ప్రకృతిలో లభించే ఈ మూడు మొక్కలతో మధుమేహాన్ని అద్భుతంగా నియంత్రించవచ్చు.

2 /4

ఇన్సులిన్ ప్లాంట్ ఈ మొక్క పేరే ఇన్సులిన్ మొక్క. శాస్త్రీయ నామం కోస్టస్ ఇగ్నస్ Costus Igneus.ఈ మొక్క ఆకుల్లో ఔషధ గుణాలు పుష్కలంగా లభిస్తాయి. ఈ ఆకుల రసం తాగడం వల్ల బ్లడ్ షుగర్ ఎప్పటికప్పుడు నియంత్రణలో ఉంటుంది. 

3 /4

దిల్... ఇదొక ఆయుర్వేద గుణాలు కలిగిన మొక్క. మధుమేహం వ్యాధిగ్రస్తులకు వరంగా భావిస్తారు. కొంతమంది సోవా అని కూడా పిలుస్తారు. మధుమేహం సమస్య ఉన్నవారికి చాలా లాభదాయకమిది. ఈ మొక్క శరీరంలోని ఇన్సులిన్ ఉత్పాదనను కూడా పెంచుతుంది. ఇంట్లో కుండీలో పెంచుకోవచ్చు.

4 /4

అల్లోవెరా అల్లోవెరా గురించి అందరికీ తెలిసిందే. చాలామంది ఇళ్లలో ఉంటుంది. ఇందులో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. చాలామంది చర్మ సంరక్షణ, కేశాల ఆరోగ్యం కోసం వినియోగిస్తుంటారు. అయితే అల్లోవెరాతో బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రించవచ్చని చాలామందికి తెలియదు. అల్లోవెరా జెల్ తీసి జ్యూస్ చేసుకుని తాగాలి. పరగడుపున తాగితే చాలా మంచిది. కొద్దిరోజుల్లోనే ఫలితం కన్పిస్తుంది.