karthika masam Prabhodini Ekadashi 2024: కార్తీకంను హిందువులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. అంతే కాకుండా.. దీనిలో వచ్చే ఏకాదశికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉందని చెప్తుంటారు. ఈ సారి దేవ్ ఉత్థనీ ఏకాదశి ఏ రోజు వస్తుందో ఇప్పుడు చూద్దాం.
కార్తీక మాసంలో మనం ఏ పూజలు,హోమాలు, జపాలు చేయించిన కూడా అది రెండు వందల రెట్లు మంచి చేకూరుస్తుంది. ఆషాడ మాసంలో యోగ నిద్రలోకి వెళ్లిన విష్ణువు.. కార్తీక మాసంలో మేల్కొంటారని చెప్తుంటారు. అందుకే ఈ మాసంలో ఏపని చేసిన అది మంచి యోగాల్ని కల్గజేస్తుందంట.
అందుకే కార్తీకంను ఎంతో పవిత్రంగా భావిస్తారు. అయితే.. కార్తీకంలో ఈసారి ప్రభోదిని ఏకాదశి.. నవంబరు 12 వ తేదీన వస్తుంది. ఈరోజున సూర్యోదయంకన్న ముందు నిద్రలేచి స్నానాదికాలు పూర్తి చేసి దేవుడి దగ్గర దీపారాధన చేయాలి.
ముఖ్యంగా దేవ్ ఉత్థనీ ఏకాదశిని ప్రభోదిని ఏకాదశి అని కూడా పిలుస్తుంటారు. ఈ రోజున విష్ణుమూర్తి ప్రీతికోరకు దీపాలు వెలిగించడం, ఉసిరికాయ దీపాలను దానంగా ఇవ్వడం వంటివి చేస్తే కోటి రెట్లు మంచి ఫలితం కల్గుతుందంట.
శివుడికి అభిషేకం అంటే ఇష్టం. అదే విధంగా విష్ణువుకు రక రకాల పూలతో స్పెషల్ గా అలంకరణ అంటే ఎంతో ప్రీతి. అందుకే మంచి పూలతో అలంకరించాలని పండితులు చెబుతుంటారు. ఏకాదశి రోజున మనం ఉపవాసాలు చేస్తే.. ఏడాదంతా ఉపవాసం చేసిన పుణ్యం వస్తుందంట.
అంతే కాకుండా.. ఈ ఏకాదశి రోజు.. వస్త్రదానం, ఫలదానం వంటివి చేస్తే మంచి జరుగుతుందంట. అదే విధంగా నదీ స్నానం చేసిన కూడా అద్భుతమైన యోగం ప్రాప్తింస్తుందంట. అందుకే ఈ ఏకాదశిని అంత పవిత్రంగా భావిస్తారు.
ఉత్థాన ఏకాదశి రోజు సత్యనారాయణ వ్రతాలుకనుక ఆచరిస్తే గతంలో తెలిసి, తెలియక చేసుకున్న పాపాలన్ని కూడా పటాపంచలైపోతాయని కూడా పండితులు చెబుతుంటారు. అందుకే కార్తీక మాసంను అంత పవిత్రంగా భావిస్తారు.