7Th Pay Commission New Update: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు DAతో పాటు ఊహించని స్థాయిలో జీతాలు పెంపు!

7Th Pay Commission Latest News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంతగానో ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘంపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే, వచ్చే వారం ప్రకటించనున్న డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) పెరుగుదల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుక కాబోతున్నట్లు తెలుస్తోంది. అలాడే డీఏ 3 శాతం పెరిగే అవకాశాలు ఉన్నాయని ఉద్యోగులు అంచనాలు వేస్తున్నారు.
 

1 /7

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పదవీ విరమణ చేసిన వారీ జీతాలలో పెరుగుదలను పొందనున్నారని సమాచారం. DA (డియర్‌నెస్ అలవెన్స్) పెంపు ద్వారా కోటి మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రయోజనం పొందే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనాలు వేస్తున్నారు.

2 /7

కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 25న డీఏ పెంపుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులను జారీ చేయనుంది. దీపావళి పండుగ ఈ నెల చివరలో వచ్చే నేపథ్యంలో పండుగకు ముందే ఈ ప్రకటన వెలువడే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

3 /7

DA 3 శాతం పెరగనుంది అంటే, ఉద్యోగుల జీతాలలో మరింత పెరుగుదల ఉండబోతుంది. పండుగ సమయంలోనే ఈ పెంపు అమలులోకి వస్తే ఉద్యోగులకు అదనపు ఆదాయం లభించే అవకాశం ఉంటుంది.  

4 /7

డీఏ 3% పెరిగి మొత్తం 53% అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీని బట్టి ప్రస్తుతం ఉద్యోగులు తమ బేసిక్ పేపై 50% డీఏ పొందుతున్నారు. త్వరలో జరుగుతున్న ఈ పెంపు తర్వాత, అదే బేసిక్ పేపై 53% డీఏ లభిస్తుంది.

5 /7

కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు కూడా త్వరలోనే పెరగబోయే డీఏ వర్తిస్తుంది. కాబట్టి, డీఏ పెంపు వారి పెన్షన్లను కూడా పెంచుతుంది.

6 /7

ద్రవ్యోల్బణం కారణంగా వస్తువులు, సేవల ధరలు పెరుగుతున్నాయి. డీఏ పెంపు ద్వారా ఉద్యోగులకు కాస్త ఉపశమనం లభించడమే కాకుండా.. వస్తువులను సులభంగా కొనుగోలు చేయగలుగుతారు.

7 /7

అదనపు ఆదాయం వల్ల ఉద్యోగుల  ఆర్థిక స్థితిలు కూడా మెరుగుపడే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనాలు వేస్తున్నారు. ఇంటి అద్దె, విద్య, వైద్యం వంటి ఖర్చులను సులభంగా భరించే అవకాశాలు ఉన్నాయి.